Business

ప్రముఖ బ్యాంకులో రెండేళ్లలో 20 వేలకు పైగా ఉద్యోగాల కోత-వాణిజ్య వార్తలు

ప్రముఖ బ్యాంకులో రెండేళ్లలో 20 వేలకు పైగా ఉద్యోగాల కోత-వాణిజ్య వార్తలు

* ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్

ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. కరోనా తరువాత డీమ్యాట్ ఖాతాలను ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారు. కొత్త యాప్‌లు మార్కెట్లోకి రావడం, నెట్‌వర్క్ కనెక్టివిటీ పెరగడం వలన ఈ విభాగంలో ఎక్కువ ఖాతాలను తెరుస్తున్నారు. అయితే డీమ్యాట్ అకౌంట్లలో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే తమ ట్రేడింగ్ ఖాతాలను బ్లాక్ చేయలేరు. ఈ సమస్య గురించి చాలామంది ఆందోళన లేవనెత్తారు.దీంతో ఈ విషయంలో తాజాగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట ట్రేడింగ్ చేసే వారు తమ డీమ్యాట్ అకౌంట్లలో ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు లేదా కార్యకలాపాలను గమనించినట్లయితే వెంటనే తమ ఖాతాలను బ్లాక్ చేసే ఆప్షన్‌న తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.ప్రస్తుతం ATM కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లలో ఏదైనా మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే వాటిని బ్లాక్ చేయడానికి ఆప్షన్ ఉండగా, ఇప్పుడు ఇదే సదుపాయాన్ని ట్రేడింగ్ ఖాతాలకు అందించనున్నారు. దీనికి సంబంధించి స్టాక్ బ్రోకర్లందరికీ, సెబీ జనవరి 12న సర్క్యులర్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నాటికి ఫ్రెమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. జులై 1, 2024 నుండి తమ పెట్టుబడిదారులందరికీ ఈ సదుపాయాన్ని అందించాలని సంబంధిత బ్రోకర్లకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపింది.

* ప్రముఖ బ్యాంకులో రెండేళ్లలో 20 వేలకు పైగా ఉద్యోగాల్లో కోత

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, కాస్ట్‌కటింగ్‌ వల్ల స్టార్టప్‌ కంపెనీలతోపాటు దిగ్గజ టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఈ లేఆఫ్స్‌ సెగ బ్యాంకింగ్‌ రంగాన్ని తాకింది. దాంతో బ్యాంకులు తమ ఉద్యోగులను కొలువు నుంచి తొలగిస్తున్నాయి.యూఎస్ మల్టీనేషన్‌ ఇన్వెస్టర్‌ బ్యాంకు సిటీ గ్రూప్ తాజా త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను పోస్ట్‌ చేసింది. దాదాపు రూ.15 వేలకోట్ల మేర నష్టాలు నమోదైనట్లు బ్యాంక్‌ ఇటీవల రిగ్యులేటరీకు రిపోర్ట్‌ చేసింది. కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌లో నష్టాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం రాబోయే రెండేళ్లలో కనీసం 20,000 ఉద్యోగాల్లో కోత విధించాలని యోచిస్తోంది.తిరిగి లాభాల బాట పట్టడానికి, వాటాదారులకు నగదును తిరిగి ఇవ్వడానికి సిటీ గ్రూప్ ‘కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ’ చేపట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా వచ్చే రెండేళ్లలో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సిటీగ్రూప్‌లో ప్రస్తుతం 2,39,000 మంది పని చేస్తున్నారు. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా వచ్చే రెండేళ్లలో ఇరవైవేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 8 శాతంగా ఉంది.సిటీ గ్రూప్ 2022 ఏడాదిలో 2.5 బిలియన్‌ డాలర్ల లాభాలతో పోలిస్తే ప్రస్తుత నాలుగో త్రైమాసికంలో 1.9 బిలియన్‌ డాలర్ల(రూ.15 వేలకోట్లు) నష్టాన్ని మూటగట్టుకుంది. ఆదాయం మూడు శాతం తగ్గి దాదాపు 17.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రేడింగ్ విభాగం నుంచి వచ్చే ఆదాయం అంతకు ముందు సంవత్సరం కంటే 19 శాతం తగ్గి రూ.36 వేలకోట్లకు చేరుకుంది.

* కన్జూమర్‌ గూడ్స్‌ ఇండస్ట్రీస్‌పై టాటా గ్రూప్‌ మరింత ఫోకస్‌

కన్జూమర్‌ గూడ్స్‌ ఇండస్ట్రీస్‌పై టాటా గ్రూప్‌ (Tata group) మరింత ఫోకస్‌ పెట్టింది. చింగ్స్‌ పేరిట దేశీ- చైనీస్‌ సాస్‌లు, స్మిత్‌ అండ్‌ జోన్స్‌ పేరిట అల్లంవెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసే క్యాపిటల్‌ ఫుడ్స్‌ను కొనుగోలు చేయనుంది. ఆర్గానిక్‌ టీలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు విక్రయించే ఆర్గానిక్‌ ఇండియానూ సొంతం చేసుకోనుంది. ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ విభాగంలో తన ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడానికి ఈ కొనుగోళ్లు టాటాకు దోహదం చేయనున్నాయి.
క్యాపిటల్‌ ఫుడ్స్‌ను రూ.5,100 కోట్లకు, ఆర్గానిక్‌ ఇండియాను రూ.1900 కోట్లకు టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేయనుంది. క్యాపిటల్‌ ఫుడ్స్‌లో తొలుత 75 శాతం కొనుగోలు చేసి మూడేళ్లలో మిగిలిన 25 శాతం వాటాను దక్కించుకోనుంది. ఆర్గానిక్‌ ఇండియాలో పూర్తి వాటాలను టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేయనుంది. క్యాపిటల్‌ ఫుడ్‌ పూర్తి ఆపరేటింగ్‌ కంట్రోల్‌తో పాటు, బోర్డులో మెజారిటీ సభ్యులు టాటా వ్యక్తులే ఉంటారని టాటా కన్జూమర్‌ పేర్కొంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అజయ్‌ గుప్తా కన్సల్టెంట్‌గా కొనసాగుతారని తెలిపింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్‌ ఫుడ్స్‌ టర్నోవర్‌ రూ.770 కోట్లుగా ఉంది. ఆర్గానిక్‌ ఇండియా టర్నోవర్‌ రూ.370 కోట్లు. ఈ కొనుగోళ్ల ద్వారా వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకోగలమని, దీన్నో వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నామని టాటా కన్జూమర్‌ ఎండీ, సీఈఓ సునీల్‌ డిసౌజా పేర్కొన్నారు. టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ ఇప్పటికే టాటా సాల్ట్‌, టాటా టీ గోల్డ్‌, టెట్లీ, హిమాలయన్‌, టాటా కాపర్‌+ పేరిట వివిధ ఉత్పత్తులను విక్రయిస్తోంది.

* 19 ఏండ్ల తర్వాత గూగుల్ నుంచి లే-ఆఫ్

సెర్చింజన్ గూగుల్‌తో ఆయనది 19 ఏండ్ల అనుబంధం.. ఆయన పేరు కెవిన్ బౌర్రిల్లియన్.. ఇటీవలే కంపెనీ లే-ఆఫ్స్‌లో కొలువు కోల్పోయాడు. గూగుల్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధానికి ఆయన తెర దించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గూగుల్‌తో తన సుదీర్ఘ ప్రయాణం ముగింపుపై బౌర్రిల్లియన్ తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ‘గూగుల్‌లో 19 ఏండ్ల అనుబంధానికి శుభం కార్డ్ పడింది. ఆ టీంలో 10 మందికి పైగా సభ్యుల్లో నేనొక్కడిని. నిన్న ఉదయం నాకు కఠిన నిర్ణయం ఎదురైంది. బుల్లెట్ తాకింది. ఓవర్ నైట్ నాకు ఉద్వాసన పలికిందని తెలుసుకున్నా’ అని కెవిన్ బౌర్రిల్లియన్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.ఉద్యోగం కోల్పోతే ఎదురయ్యే సవాళ్లన్నీ గుర్తుకొస్తాయి. కుటుంబ నిర్వహణ, పిల్లల కెరీర్, సవాలక్ష కష్టాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ బౌర్రిల్లియన్ మాత్రం తన ఉద్వాసనపై ఆశ్చర్యకరంగా పాజిటివ్‌గా స్పందించాడు. ‘లేఆఫ్స్ షాక్. కానీ. నాకు మటుకు ఫైన్ నిర్ణయం. చాలా సుదీర్ఘకాలం పాటు నా జీవితంలో కొంత మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే భవిష్యత్‌పై నాకు ఎటువంటి ప్రణాళికల్లేవు’ అని పేర్కొన్నాడు.

* స్మార్ట్‌టీవీ కేవలం 24 వేలకే

రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను తీసుకొచ్చింది. ఇది ఈ రోజు ప్రారంభమైంది. తక్కువ ధరలో పెద్ద స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సేల్‌లో మంచి అవకాశం లభించింది. దీనిలో 55 ఇంచుల పెద్ద టీవీని అతి తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు. iFFALCON కంపెనీకి చెందిన 138.7 cm (55 అంగుళాల) 4K Ultra HD Smart LED Google TV అమెజాన్‌లో రూ.23,999 కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.73,990. అంటే దాదాపు 68 శాతం తగ్గింపు ధరతో ఈ టీవీ లభిస్తుంది. అదనంగా కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్స్‌పై రూ.1500 వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది.iFFALCON 55 అంగుళాల స్మార్ట్‌టీవీ 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్‌ను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 60Hz. 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 4K HDR కలర్‌‌తో యూజర్లు అత్యుత్తమైన నాణ్యతతో వీడియోలను చూస్తారని కంపెనీ పేర్కొంది. మెరుగైన గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. Google Tv ద్వారా క్రోమ్‌కాస్ట్, ఫొటోస్‌, ప్లేస్టోర్ వంటి వాటికి యాక్సెస్ ఉంటుంది. Netflix, Youtube, Prime Video వంటి 7000+ ఎక్కువ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.178 డిగ్రీల యాంగిల్ నుంచి చూసిన కూడా పిక్చర్ క్లియర్‌గా కనిపిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. యూజర్లు మెరుగైన సౌండ్ అనుభూతిని పొందడానికి 24W సపోర్ట్‌తో Dolby ఆడియోను అందించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z