Business

జియో వినియోగదారులకు శుభవార్త!

జియో వినియోగదారులకు శుభవార్త!

భారతదేశంలోని ప్రముఖ టెలికాం ప్లేయర్‌లలో ఒకటైన రిలయన్స్ జియో 44 కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. దాని విస్తృతమైన కస్టమర్ కమ్యూనిటీ వాల్యూను అందించడంలో కంపెనీ నిబద్ధత, ఆకర్షణీయమైన ఆఫర్‌లతో కూడిన కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను జియో అనౌన్స్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు కస్టమర్స్ సౌలభ్యం కోసం, జియో తన రీఛార్జ్ ప్లాన్‌లను మరింత విస్తృతపరిచింది. చందాదారులు వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా సరసమైన ఎంపికలను సులభంగా ఎంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.

అధిక ఇంటర్నెట్ వినియోగం
డేటా-ఇంటెన్సివ్ యాక్టివిటీస్‌లో భాగంగా కస్టమర్స్ కోసం రిలయన్స్ జియో కేవలం రూ. 219తోనే ఓ సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ అధిక డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఇంటర్నెట్ ను అధికంగా వినియోగించేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

రూ. 219 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
ఈ రూ. 219 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ ను 14 రోజుల పాటు అందిస్తుంది. ఈ సమయంలో యూజర్లు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్‌ను పొందే వీలు కూడా ఉంటుంది. దీంతో పాటు చందాదారులు 100 కాంప్లిమెంటరీ SMSలను కూడా అదనంగా పొందుతారు. ఈ ప్లాన్ వినియోగదారులకు 14 రోజులకు పైగా 42GB డేటాను అందిస్తుంది. ప్రతిరోజూ 3GB ఇంటర్నెట్ డేటా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా, ఈ ప్లాన్‌లో ప్రత్యేకమైన 2GB ఉచిత డేటా ఉంది. దీని విలువ కేవలం రూ. 25 మాత్రమే. ఇది మొత్తం డేటా ఆఫర్‌ను 44జీబీకి పెంచుతుంది.

ఉచిత సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు: జియో రీఛార్జ్ ప్లాన్‌లతో రూ. 219 ప్లాన్‌కు సబ్‌స్క్రైబర్‌లు జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమాలకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందుకుంటారు. జియో సినిమాకి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను చేర్చడం వల్ల వినియోగదారులు విభిన్నమైన వెబ్ సిరీస్‌లు, సినిమాలు, టీవీ షోలను యాక్సెస్ చేయగలుగుతారు. మొత్తంగా రూ. 219 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ సరసమైన, డేటా-రిచ్ ఆప్షన్‌ను అందింస్తుంది. ఇది జియో వినియోగదారులకు బెస్ట్ డిజిటల్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z