* టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ… తెలుగు రాష్ట్రాల్లోనూ బలాన్ని పెంచుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అసంతృప్తి నేతలను, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాయపాటిని బీజేపీ నేత రాం మాధవ్ కలిశారు. రాయపాటి ఇంటికి వెళ్లి మరీ బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.గుంటూరు జిల్లాలో రాయపాటి కుటుంబానికి బలం ఎక్కువే. ఆయన కనుక బీజేపీలో చేరితే… ఆయన మద్దతుదారులంతా బీజేపీలోకి వచ్చి చేరే అవకాశం ఉంది. దాంతో పార్టీని ప్రతిష్టం చేసుకోవచ్చని బీజేపీ యోచిస్తోంది. రాం మాధవ్ ఇచ్చిన ఆఫర్ పై రాయపాటి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఢిల్లీ వచ్చి పార్టీ పెద్దలను కలుస్తానని రాయపాటి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. రాం మాధవ్ తో భేటీ తర్వాతి రోజే.. రాయపాటి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనకున్న ఇబ్బందులను చంద్రబాబుకి వివరించినట్లు సమాచారం. ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ఇంటి వ్యవహారంతోపాటు.. పలు సమస్యలను విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… రాయపాటి మాత్రం పార్టీ మారాలా లేదా.. టీడీపీలోనే కొనసాగాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండు, మూడు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
*ర్ణాటక క్రైసిస్: రెబెల్ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన సుప్రీం……
కర్ణాటకలో నిర్ణీత కాలవ్యవధిలోనే రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌ను ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదంటూ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై మంగళవారం నాడు రెండు వర్గాల వాదనలను సుప్రీంకోర్టు వింది. బుధవారం నాడు ఉదయం ఈ విషయమై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తీర్పును వెల్లడించారు.రెబెల్ ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకొనే అధికారం స్పీకర్‌కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కర్ణాటక అసెంబ్లీలో గురువారం నాడు విశ్వాస పరీక్ష నిర్వహించుకొనేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణీత కాలపరిమితిలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. రాజీనామాలపై నిర్ణయం తీసుకొనే అధికారం స్పీకర్దేనని తేల్చి చెప్పింది. గురువారం నాడు అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వ బలపరీక్షకు హాజరయ్యే విషయంలో రెబెల్ ఎమ్మెల్యేలే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
* పీసీసీ రేసులో రేవంత్ ..సెకండ్ ఆప్షన్‌గా జీవన్‌రెడ్డి?
తెలంగాణ కాంగ్రెస్ కు ఆగస్టు మొదటి వారంలో కొత్త అధ్యక్షుడు రానున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, గోవా రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇటీవలే మహారాష్ట్రకు పార్టీ చీఫ్ ను నియమించారు. మిగిలిన ఢిల్లీ, గోవా రాష్ట్రాలతో పాటే తెలంగాణలో సైతం పార్టీ అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటే టీపీసీసీకి ప్రెసిడెంట్‌ను నియమించాలని భావిస్తున్నారంటే ఇక్కడి పార్టీ వ్యవహారాలపై తమ అధినాయకత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చని ఓ సీనియర్ నేత చెప్పారు. వచ్చే నెల 10 వ తేదీ లోపు కోత్త పీసీసీ చీఫ్ నియామకం ఉంటుందనీ, ఈ మేరకు ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయని ఓ మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు.
* భూపతిరెడ్డి పై వేటు సబబే: హై కోర్టు
సన మండలి లో భూపతిరెడ్డిపై అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భూపతిరెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అనర్హత రాజ్యాంగ బద్దంగానే ఉందని పేర్కొంది. 2016 లో స్థానిక సంస్థల కోటలో టీఆర్ఎస్ తరపున్న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు భూపతి రెడ్డి. అయితే ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధ్యక్షుడు కేసీఆర్ కు మాజీ ఎంపీ కవిత, నిజామాబాద్ జిల్లా నేతలు లేఖ రాశారు. దీంతో భూపతిరెడ్డి పై వేటు పడింది. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భూపతిరెడ్డి కాంగ్రెస్ లో చేరారు.
* సీఎం కేసీఆర్ రైతులను పట్టించుకోవడం లేదు: దత్తాత్రేయ
రాష్ట్రంలో కరువు పరిస్థితి నెలకొని ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ. రైతాంగ సమస్యలపై సెక్రటేరియట్ లో సీఎస్ జోషీని కలిశారు దత్తాత్రేయ. మీడియాతో మాట్లాడిన ఆయన… సూర్యా పేట్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో వర్షపాతం తక్కువగా ఉండి పంటలు వేసుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు రుణమాఫీపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. పాత బాకీ కడితేనే కొత్త అప్పులు ఇస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని అన్నారు.
* కాపులకు 5 శాతం కోటా కొనసాగించేందుకు జగన్ కట్టుబడి ఉన్నారా : చంద్రబాబు
కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో వాడివేడి సంవాదాలు చోటు చేసుకున్నాయి. కాపులకు 5 శాతం కోటా కొనసాగించేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారా.. లేదా.. అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరక్కుండా.. రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించామని చెప్పారాయన. రెండుసార్లు మేనిఫెస్టోలో పెట్టి దగా చేసింది వైఎస్సార్ అంటూ చంద్రబాబు విమర్శించారు.
*కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు: సంపత్‌కుమార్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కేసీఆర్.. అసెంబ్లీని రాజరికపు, కుటుంబ వ్యవహారంగా నడుపుతున్నారన్నారు. సార్థకతలేని అసెంబ్లీ సమావేశాలు ఒక్క తెలంగాణలోనే జరుగుతున్నాయని, ప్రశ్నించే వారిని కేసీఆర్ అణిచివేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా కుంటుపడిందని, ప్రజల సొమ్మును రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదని ఆయన అన్నారు.
*15 రోజులు ఎదురు చూస్తా: జగ్గారెడ్డి
తాగునీటి సమస్యపై చాలా రోజులుగా పోరాడుతున్నానని.. ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినా అధికారులు గానీ ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ వేసవి నుంచి తాగునీటి సమస్య మరింత ఎక్కువైందన్నారు. సింగూర్‌లో ఉన్న 16 టీఎంసీల నీటిని పొరుగు జిల్లాకు తరలించడం వల్లనే తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. వర్షాలు లేకపోవడం కూడా ఇబ్బందిగా మారిందన్నారు. కర్నాటకలో వర్షాలు కురిసినా సింగూర్‌కు కొంత మేర నీరు వచ్చేదన్నారు.
*రెండు పార్టీలు క్లోజ్: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీలు కచ్చితంగా త్వరలోనే మూతపడనున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి ఎవరెవరు వస్తున్నారో ఇప్పుడే చెబితే ఎలా.. సస్పెన్స్ ఉండదన్నారు. రాజకీయ పార్టీలకు మిత్రపక్షం-శత్రుపక్షం అంటూ ఉండవని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనన్నారు. అసెంబ్లీలో సభ్యుల వ్యవహార శైలిలో అప్పుడు.. ఇప్పుడు మార్పు కనిపించట్లేదన్నారు. అప్పుడు వ్యక్తిగత దూషణలతో సభ నడిస్తే.. ఇప్పుడు కూడా అదే పద్ధతిలోనే నడుస్తుందని వివరించారు. సభ్యులు అసెంబ్లీలో పరుషమైన భాషను వాడటం మంచిది కాదని హితవు పలికారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నట్టు భావన కనబడుతోందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. అందులో ప్రయోజనాలన్నీ వస్తున్నాయని వెల్లడించారు.
* పోటీపడి ఇసుక దోచేస్తున్నారు : చంద్రబాబు
ఇసుక అక్రమ రవాణాలో వైకాపా నేతలు జుట్లు పట్టుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం పోటీపడి ఇసుక దోచేస్తున్నారని, పరస్పరం పోలీసు కేసులు పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇసుక కొరతతో రాజధానిలో పనులు నిలిచిపోయాయన్న చంద్రబాబు.. భవన నిర్మాణ రంగం కుదేలయిందన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు, యువత, మహిళల ఎదురుచూస్తున్నారని చంద్రబాబు అన్నారు. అయితే సమస్యలు వదిలేసి సాధింపులపైనే వైకాపా శ్రద్ధ పెట్టిందని ఆయన మండిపడ్డారు.
* భూపతిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
శాసనమండలిలో అనర్హతకు గురైన భూపతిరెడ్డికి హైకోర్టులో నిరాశే ఎదురైంది. భూపతిరెడ్డిపై అనర్హత చట్టబద్ధంగానే ఉందని హైకోర్టు పేర్కొంది. స్పీకర్, మండలి ఛైర్మన్లకు సభ్యులపై అనర్హత విధించే అధికారాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని 8వ పేరాను సవాల్ చేస్తూ భూపతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారంటూ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేశారు. భూపతిరెడ్డితో పాటు అనర్హతకు గురైన యాదవ రెడ్డి, రాములు నాయక్‌ల పిటిషన్లను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది.
*కేసీఆర్ కిట్లు అందరికీ అందేలా చూడాలి: నామా
మాతా, శిశు సంక్షేమమే ప్రాధాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు అందరికీ అందేలా చూడాలని తెరాస లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు సూచించారు. తెరాస కార్మిక విభాగానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు దిల్లీలో మంగళవారం నామాను కలిశారు. దేశంలో మొదటిసారిగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. నామాను కలిసిన వారిలో పారిజాతం, కళావతి, ఉష, కరుణ తదితరులున్నారు.
*పార్లమెంటుకు గైర్హాజరా?
చట్టసభలకు గైర్హాజరయ్యే కేంద్రమంత్రులపై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటులో రోస్టర్ పద్ధతిపై నిత్యం ఉండి రెండేసి గంటలపాటు విధులు నిర్వహించే బాధ్యతను మంత్రులకు అప్పగిస్తారు. కొందరు మంత్రులు ఈ విధులకు రావడం లేదని గుర్తించిన ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరవుతున్న మంత్రుల వివరాలు సేకరించి ఆ జాబితాను మంగళవారం సాయంత్రానికల్లా తనకు అందజేయాలని పార్టీ నాయకులను కోరారు. ఎంపీలు క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరు కావాలని సూచించారు. మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం 2025 వరకూ ఒక మార్గసూచిని రూపొందించుకొని క్షయ, కుష్టు, వైకల్యం లాంటి మానవీయ సామాజిక అంశాల పరిష్కారంపై దృష్టిపెట్టి పనిచేస్తోంది.
*సీపీఐ, ఎన్సీపీ, తృణమూల్ జాతీయహోదాకు ఎసరు!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ తమకున్న జాతీయ పార్టీ హోదాను కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వాటికి ఎదురైన నిరాశాజనక ఫలితాలే అందుకు కారణం. జాతీయ పార్టీ హోదా ఎందుకు ఉపసంహరించుకోకూడదో తెలియజేయాలంటూ ఆ మూడు పార్టీలకు ఎన్నికల కమిషన్ షోకాజ్ తాఖీదు జారీ చేసే అవకాశముందని తెలుస్తో
*విపక్ష నేతలు ప్రగతి నిరోధకులు
తెలంగాణలోని విపక్ష పార్టీల నేతలు ప్రగతి నిరోధకులుగా మారారని, ప్రతీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అడ్డుపడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెరాస శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు మణిహారంగా నిర్మించబోతున్న సచివాలయం, శాసనసభ భవనాలను ఆపాలని గవర్నర్‌ను వారు కోరడం సిగ్గు చేటన్నారు.
*ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: షబ్బీర్ అలీ
వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో కరవు తాండవిస్తోంటే.. సీఎం కేసీఆర్ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ విమర్శించారు. వ్యవసాయ అనుబంధ శాఖల మీద సమీక్షించకుండా మున్సిపల్ ఎన్నికలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌లో షబ్బీర్‌అలీ మాట్లాడుతూ..మున్సిపల్చట్టం సవరణ కోసం ఏర్పాటు చేస్తున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను కనీసం వారం రోజుల పాటు నిర్వహించి వివిధ అంశాలపై చర్చించాలన్నారు.
*తెలంగాణ పాలకులతో లాలూచీ
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్ని నిలిపివేసి, గోదావరి జలాల తరలింపు పథకాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం అవివేకమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణలో కాలువల ద్వారా నాగార్జునసాగర్ వద్ద గోదావరి నీటిని ఎత్తిపోయడానికి రూ.50 కోట్లకుపైగా అయ్యే వ్యయంలో ఏపీ ఎందుకు వాటా చెల్లించాలి? అదే మొత్తంతో ఏపీలోని ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలి.
*కూల్చివేతలు ఆపండి-గవర్నర్‌ను కోరిన విపక్ష నేతలు
అసెంబ్లీ, సచివాలయ భవనాల కూల్చివేత, కొత్తవి కట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని పలు పార్టీల నేతలు విజ్ఞప్తిచేశారు. గవర్నర్‌కు ఉన్న విశేషాధికారాలతో చారిత్రక కట్టడాల తొలగింపును అడ్డుకోవాలని కోరారు.
*రాజ్యసభకు నీరజ్శేఖర్ రాజీనామా
మాజీ ప్రధాని చంద్రశేఖర్ తనయుడు, సమాజ్‌వాదీ పార్టీ నేత నీరజ్శేఖర్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడును కలిసిన నీరజ్ తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నానని తెలపడంతో ఆయన ఆమోదించారు. సమాజ్‌వాదీ పార్టీలో ప్రముఖ నేతగా పేరొందిన నీరజ్శేఖర్ భాజపాలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. 2014లో ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. 2020, నవంబర్ 25 వరకు ఆయన పదవీ కాలం ఉన్నా రాజీనామా చేశారు.
*ఏపీ ముఖ్యమంత్రి జగనా?కేసీఆరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనో…కేసీఆరో అర్థం కావట్లేదని శాసనమండలి చర్చలో పాల్గొన్న ఎమ్మెల్సీ లోకేశ్ విమర్శించారు. ఏపీ హక్కుల్ని పణంగా పెట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిర్మించాలనుకోవటం సరికాదన్నారు. ‘వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కొయ్యగుర్రాన్ని తలపిస్తోంది. గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు వైకాపా కార్యకర్తల దోపిడీ పథకంగా మారాయి. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్మోహన్రెడ్డి… తిరుపతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్లు పట్టుకున్నారు. అమరావతిని భ్రమరావతి చేసింది జగన్ ప్రభుత్వమే. ప్రభుత్వ చర్యల వల్ల ఇక్కడ పనులన్నీ ఖాళీ అయిపోయాయి’ అని లోకేశ్ విమర్శించారు.
*వైకాపాకు అధికారం.. పిచ్చోడి చేతిలో రాయి
వైకాపాకు అధికారం పిచ్చివాడి చేతిలో రాయిలా మారిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ రాయితో వాళ్లను వాళ్లూ కొట్టుకోవచ్చు, ఎదుటివారినీ కొట్టవచ్చని అన్నారు. మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో సోమవారం సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు…‘‘వైకాపా నేతలది విధ్వంసకర ధోరణి. తెదేపా నిర్మించిన వ్యవస్థల్ని కూల్చడమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోంది. పోలవరం, రాజధాని, ఇతర ప్రాజెక్టుల పనుల్లో ప్రతిష్టంభన తేవడమే వాళ్ల ప్రధాన ఉద్దేశం’’ అని అభిప్రాయపడ్డారు.
*వైఎస్ వల్లే ఏపీకి కియా: బుగ్గన
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విజ్ఞప్తి మేరకే కియా పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలపై ఎమ్మెల్యేలు గోవర్ధన్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి వేసిన ప్రశ్నలపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడారు. వైఎస్ఆర్ విజ్ఞప్తి మేరకు కియా పరిశ్రమ వచ్చిందన్న విషయాన్ని సీఎం జగన్‌కు ఆ సంస్థ సీఈవో, అధ్యక్షుడు హన్-వూ పార్క్ రాసిన లేఖలో పేర్కొన్నారని తెలిపారు. సభలో ఆయన ఆ లేఖను చదివి వినిపించారు.
*ఏపీ ముఖ్యమంత్రి జగనా?కేసీఆరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనో…కేసీఆరో అర్థం కావట్లేదని శాసనమండలి చర్చలో పాల్గొన్న ఎమ్మెల్సీ లోకేశ్ విమర్శించారు. ఏపీ హక్కుల్ని పణంగా పెట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిర్మించాలనుకోవటం సరికాదన్నారు. ‘వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కొయ్యగుర్రాన్ని తలపిస్తోంది. గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు వైకాపా కార్యకర్తల దోపిడీ పథకంగా మారాయి. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్మోహన్రెడ్డి… తిరుపతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్లు పట్టుకున్నారు. అమరావతిని భ్రమరావతి చేసింది జగన్ ప్రభుత్వమే. ప్రభుత్వ చర్యల వల్ల ఇక్కడ పనులన్నీ ఖాళీ అయిపోయాయి’ అని లోకేశ్ విమర్శించారు.
*ముఖ్యమంత్రి నిర్ణయం సాహసోపేతం: ఆర్.కృష్ణయ్య
చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రాజ్యసభలో వైకాపా తరఫున బీసీ బిల్లు పెట్టడం సాహసోపేతమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలో కలిసి ప్రత్యేకంగా అభినందించానని సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. 56శాతం జనాభా ఉన్న బీసీలకు చట్టసభల్లో 14శాతం ప్రాతినిధ్యం మించకపోవడం శోచనీయమని తెలిపారు.
*రూ.2,000 బదులు రూ.15,000 ఇవ్వడం దారుణమా?
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి బదులుగా ఏటా రూ.15,000 ఇస్తామంటే తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు దానిని దారుణమనడం విడ్డూరంగా ఉందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘రూ.2,000 కంటే రూ.15,000 తక్కువని చంద్రబాబు చెబితే నమ్మాలి. లేదంటే ధర్నాలు చేయిస్తారట. ఒక్కో విద్యార్థిపై మధ్యాహ్న భోజనం ఖర్చు ఏడాదికి రూ.2 వేలు. దాని స్థానంలో రూ.15 వేలు ఇస్తామని సీఎం జగన్ చెబితే దారుణమంటున్నారు’ అని సోమవారం ట్విటర్లో విమర్శించారు.
*పోలవరంపై ప్రజలకు క్షమాపణ చెబుతారా: నిమ్మల
పోలవరం నిర్మాణం పూర్తయితే ఆ క్రెడిట్ చంద్రబాబుకి దక్కుతుందన్న ఉద్దేశంతోనే వైకాపా ప్రభుత్వం తమపై బురద జల్లుతోందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ… ‘‘ప్రాజెక్టు వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.55 వేల కోట్లకు తెదేపా ప్రభుత్వం పెంచేసిందని ఇన్నాళ్లు మీ నాయకులు, కార్యకర్తలు ఊరూవాడా ప్రచారం చేశారు.
*తెదేపా ఎమ్మెల్యేలు సంప్రదించలేదు
భాజపాలో చేరేందుకు తెదేపా ఎమ్మెల్యేలు ఎవరూ తమను సంప్రదించలేదని, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం చేరేందుకు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటం లేదని, గత ప్రభుత్వం కంటే క్షేత్రస్థాయిలో అరాచకం ఎక్కువైందని విమర్శించారు. గ్రామ వాలంటీర్లు మరో జన్మభూమి కమిటీలేనని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల తర్వాత ప్రజలు వాస్తవాలను గ్రహించారని, 2024లో రాష్ట్రంలో భాజపా జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
*రాజ్యసభకు నీరజ్శేఖర్ రాజీనామా
మాజీ ప్రధాని చంద్రశేఖర్ తనయుడు, సమాజ్‌వాదీ పార్టీ నేత నీరజ్శేఖర్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడును కలిసిన నీరజ్ తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నానని తెలపడంతో ఆయన ఆమోదించారు. సమాజ్‌వాదీ పార్టీలో ప్రముఖ నేతగా పేరొందిన నీరజ్శేఖర్ భాజపాలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. 2014లో ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. 2020, నవంబర్ 25 వరకు ఆయన పదవీ కాలం ఉన్నా రాజీనామా చేశారు.
*ఇదేం సామాజిక న్యాయం?
మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం చేశామని చెబుతున్న ప్రభుత్వం కీలకమైన అధికారిక స్థానాలు, నియామక పదవుల్లో అత్యధిక శాతం ఒక సామాజికవర్గానికి చెందిన వారినే నియమించిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం ఆయన శాసనమండలిలో మాట్లాడారు. ప్రజావేదికను కూల్చేసిన ప్రభుత్వం… ఎక్కడికక్కడ ఉన్న వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను తొలగించటానికీ సిద్ధమైతే ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించేందుకు తాము అంగీకరిస్తామన్నారు. 30 పథకాలకు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టారని, భవిష్యత్తులో రాజారెడ్డి పేరు కూడా పెడతారేమోనని అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రత్యేక విమానాల్లో జగన్ తిరిగారని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు చేయడం కొత్త కాదని, ప్రభుత్వ ఖర్చులన్నీ దుబారా ఖర్చులుగా చూడటం సరికాదని పేర్కొన్నారు.
* సుప్రీం తీర్పుతో కర్నాటకలో కీలక మలుపు
కర్నాటకలో రేపటి బలపరీక్షకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెబల్ ఎమ్మెల్యేల రిజైన్ల విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదంపై స్పీకర్‌దే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీకి వెళ్లాలా, వద్దా అనేది ఎమ్మెల్యేల ఇష్టమని, ఆ 15 మంది ఎమ్మెల్యేలు సభకు రావాలని ఎవరూ బలవంత పెట్టలేరని చెప్పింది. రిజైన్ల ఆమోదానికి స్పీకర్‌కు కాలపరిమితి పెట్టలేమని కూడా తేల్చిచెప్పింది. ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ పోషించాల్సిన పాత్రపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతానికి ఈ కేసులో రెబల్స్ రాజీనామాలపై నిర్ణయం స్పీకర్దేనని వివరించింది. సభాపతి విచక్షణాధికారాల విషయంలో తమ జోక్యం ఉండబోదని పేర్కొంది.
బీజేపీలోకి రాయపాటి? రెండు రోజుల్లో ఢిల్లీకి-రాజకీయ–07/17
Related tags :