ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇటీవల యూకే నుండి హైదరాబాద్ వచ్చిన ఎన్నారై గౌస్ మొయినుద్దీన్‌ను దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు గౌస్ మొయినుద్దీన్ ఇటీవల యూకే నుండి నుండి హైదరాబాద్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉 – Please join our whatsapp channel here –