Movies

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయనున్న పలు సినిమాల జాబితా!

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయనున్న పలు సినిమాల జాబితా!

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు నాన్‌స్టాప్‌ వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. అగ్ర కథానాయకుల చిత్రాలతోపాటు యంగ్‌ హీరోల సినిమాలను వరుసగా స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు #NetflixPandaga (నెట్‌ఫ్లిక్స్‌ పండగ) పేరుతో పోస్టర్లు విడుదల చేసింది. ఆయా చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాక ఓటీటీలోకి రానున్నాయి. అవేంటో చూసేయండి..

సలార్‌: ప్రభాస్‌ (Prabhas), పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమా (Salaar) బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబరు 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా తమ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిపిన ‘నెట్‌ఫ్లిక్స్‌’ డేట్‌ను ఇంకా ఖరారు చేయలేదు.

దేవర: ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత హీరో ఎన్టీఆర్‌ (NTR)- డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది (Devara). ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడు. ‘‘ఈ సముద్రం సేపల్ని కంటే, కత్తుల్ని.. నెత్తుర్నే ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’’ అంటూ టీజర్‌లో వినిపించే ఎన్టీఆర్‌ డైలాగ్‌ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచింది. దేవర పార్ట్‌ 1 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది.

పుష్ప-ది రూల్‌: ‘పుష్ప- ది రైజ్‌’కు సీక్వెల్‌గా రూపొందుతున్న మూవీ ఇది (Pushpa 2: The Rule). ఫస్ట్‌ పార్ట్‌ బ్లాక్‌బస్టర్‌కావడంతో సెకండ్‌ పార్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్‌ పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్‌’లోని నటనకుగాను అల్లు అర్జున్‌ (Allu Arjun)కు జాతీయ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ‘పుష్ప: ది రూల్‌’.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది.

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి: విశ్వక్‌సేన్‌ (Vishwak Sen), నేహాశెట్టి జంటగా కృష్ణ చైతన్య రూపొందిస్తున్న మూవీ ఇది (Gangs of Godavari). మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఓటీటీలోకి రానుంది.

టిల్లు స్క్వేర్‌: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్‌ జంటగా మల్లిక్‌ రామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది (Tillu Square). త్వరలోనే థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఓటీటీలో సందడి చేయనుంది.

వీడీ 12 (వర్కింగ్‌ టైటిల్‌): విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ఇది (VD 12). శ్రీలీల కథానాయిక. తెలుగుసహా ఐదు భాషల్లో ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

ఎన్బీకే 109 (వర్కింగ్‌ టైటిల్‌): బాలకృష్ణ (Balakrishna) హీరోగా కె. బాబీ తెరకెక్కిస్తున్న చిత్రమిది (NBK 109). నాయిక వివరాలు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

బడ్డీ: అల్లు శిరీష్‌ ప్రధాన పాత్రలో సామ్‌ ఆంటోన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. గాయత్రి భరద్వాజ్‌, గోకుల్‌ కీలక పాత్రధారులు.

యువీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం, సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ నిర్మిస్తున్న సినిమా, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో కోనసీమ నేపథ్యంలో రూపొందనున్న మూవీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లోనే స్ట్రీమింగ్‌ కానున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z