Devotional

వృషభ రాశివారు ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు-రాశిఫలాలు

వృషభ రాశివారు ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు-రాశిఫలాలు

మేషం

కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలపరంగా కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి సంబంధం విషయంలో శుభవార్త అందుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు, కుటుంబపరంగా చిన్న చిన్న చిరాకులు తప్పకపోవచ్చు. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి.

వృషభం

వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. ప్రతి పని లోనూ శ్రమాధిక్యత ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు పరవాలేదనిపి స్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు.

మిథునం

గ్రహాల అనుకూలత వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభాల బాటపడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. విదేశాల నుంచి ఆశిం చిన సమాచారం అందుతుంది. విదేశీ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కర్కాటకం

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఒకటి రెండు కుటుంబ సమ స్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. గృహ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది.

సింహం

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపా రాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగావకాశాలు అందివస్తాయి. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులకు సహాయం చేస్తారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నం విజయవంతం అవుతుంది.

కన్య

ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.. వృత్తి, వ్యాపారాలు లాభదా యకంగా సాగిపోతాయి. కొందరు ప్రముఖులతో్ పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం విష యంలో వ్యవహారాల్లో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవు తాయి.

తుల

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ధనపరమైన చిక్కులు, సమస్యలు తొలగి పోతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం

ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహా రాల్లో ఆటంకాలు, అవరోధాలు ఉండవచ్చు. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడక నడు స్తాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవ కాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభి స్తుంది.

ధనుస్సు

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. సహోద్యోగుల కంటే ఒక అడుగు ముందుంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ సంబంధమైన వ్యవ హారాలు అనుకూలంగా ఉంటాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం

ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. దూరపు బంధువుల నుంచి సానుకూల సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం కావచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కుంభం

ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే, వృత్తి, ఉద్యోగాలు మాత్రం బాగా అను కూలంగా ఉంటాయి. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశా జనకంగా ముందుకు సాగుతాయి. ఒక శుభ కార్యంలో బంధువులకు సహాయంగా ఉంటారు. అనవసర పరిచయాల కారణంగా కొద్దిగా ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకో వద్దు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మీనం

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ముందుకు దూసుకుపోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగుల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొత్తగా ఇల్లు కొనడం మీద దృష్టి పెడ తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలి తాలు అందుకుంటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. గృహ వాతావరణం సామరస్యంగా ఉంటుంది.