చాలా తక్కువ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు అయినా.. భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ ఒకటి. యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంటోంది. తద్వారా హై రేంజ్ కలెక్షన్లను సైతం సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా RRR రికార్డును ఇది బ్రేక్ చేసింది. ఆ సంగతులను మీరే చూడండి!
సూపర్ హీరో స్టోరీతోనే: ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో మూవీనే ‘హనుమాన్’. తేజ సజ్జా హీరోగా చేసిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని అందించారు.
అక్కడ భారీ స్థాయిలో: రియల్ సూపర్ హీరో ఆంజనేయ స్వామి స్టోరీతో రూపొందిన ‘హనుమాన్’ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు థియేటర్లకు పైగానే తీసుకు వచ్చారు. దీనికి పోటీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్క్రీన్లు దక్కకున్నా.. హిందీతో పాటు ఓవర్సీస్లో ఇది అదిరిపోయే రీతిలో గ్రాండ్‌గా విడుదలైంది.
సంక్రాంతి విన్నర్‌గా: తేజ సజ్జా – ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన ‘హనుమాన్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతోంది. ఓవర్సీస్లో అయితే ఈ చిత్రం మొదటి రోజు నుంచే క్రమంగా రేంజ్‌ను పెంచుకుంటోంది. ముఖ్యంగా ‘గుంటూరు కారం’ మూవీని బీట్ చేసి సంక్రాంతి విన్నర్ అయింది.
మూడు మిలియన్లతో: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ‘హనుమాన్’ మూవీకి ఓవర్సీస్లో సైతం భారీ స్పందన దక్కింది. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 386K డాలర్స్ గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత మొదటి రోజు ఇది 520K డాలర్లు వరకూ రాబట్టింది. ఆ తర్వాత మరింతగా రాణించిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 3 మిలియన్ డాలర్లను రాబట్టింది. తద్వారా టాప్ మూవీల లిస్టులో చేరిపోయింది.
RRR రికార్డు బద్దలు: ‘హనుమాన్’ మూవీ నార్త్ అమెరికాలో మెరుగైన ప్రదర్శన చేస్తూ ఎన్నో ఘనతలను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఫస్ట్ మండే ఈ సినిమా RRR రికార్డును బ్రేక్ చేసింది. ఆ చిత్రం 472K డాలర్లను వసూలు చేయగా.. హనుమాన్ 552K డాలర్లను రాబట్టి సత్తా చాటింది. అలాగే, మొదటి మంగళవారం కూడా ఈ సినిమా RRR రికార్డును దాటేసి టాలీవుడ్లో సెన్సేషన్ అయింది.
👉 – Please join our whatsapp channel here –