NRI-NRT

వీరేశలింగం సంఘ సంస్కరణపై టాంటెక్స్ తెలుగు సదస్సు

TANTEX 114 Nela Nela Telugu Vennal NNTV On Veeresalingam

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 144 వసాహిత్య సదస్సు,12 వ వార్షికోత్సవం ను ఆదివారం, జూలై 14న డాలస్ లో సాహిత్య వేదిక సమన్వయ కర్త,ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ప్రవాసంలో నిరాటంకంగా144 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ముందుగా ఉత్తర టెక్సాస్ కార్యవర్గ మరియు పాలక మండలి సభ్యులు,అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత సాహిత్య వేదిక సమన్వయ కర్త కృష్ణా రెడ్డి కోడూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్వాతి కృష్ణమూర్తి విద్యార్థులు దీప్తి గాలి ,హాసిని దారా,సాహితి శంక,మనోగ్య బొమ్మదేవర ,శ్రీనిధి తాటవర్తి,ఉదయ్ ఓమరవెల్లి లు ప్రార్థనా గీతంతో మొదలయింది.ఆ తర్వాత త్యాగరాజ మరియు అన్నమాచార్యుల సంకీర్తనలను వీణా నాద మంజరి పేరుతో ఉమా ప్రభల,అమృత వర్షిణి అకాడమీ వారి సంగీత విద్యార్థులు శ్రావ్య కస్తూరి,ప్రనికా కస్తూరి చాలా చక్కగా వినిపించారు. అటుపిమ్మట డాక్టర్ వాణీ కుమారి ఆధునిక చారిత్రిక కావ్యాలు అనే విషయం మీద మాట్లాడి సాహిత్య ప్రియులకి గురువు యొక్క ప్రాధాన్యతని వివరించారు.మహా భారతంలో అర్జునుడికి గురువుగా కృష్ణుడి ఉపదేశం,ఛత్రపతి శివాజీ గురువుగా సమర్థ రామదాసు,కృష్ణ దేవరాయలు గురువు తిమ్మరుసు ప్రాధాన్యతలని వివరించారు.తరువాత Dr.K.N.మల్లేశ్వరి రచనా నేపద్యపు ఎంపిక -స్వీయానుభవాలు అనే అంశంపైన మాట్లాడుతూ రచయిత లేదా రచయిత్రులు రచనా విషయాన్ని ఎలా ఎంచుకొంటారో వివరించారు.ఆ తరువాత చేగొండి సత్యనారాయణ మూర్తి నిజ సంస్కృతి వైభవం -పద్య గాన విశ్లేషణ అనే అంశం మీద పద్యాలతో పాడుతూ మన భాషలో ఎన్ని యాసలున్నా ఎన్ని ప్రాంతాలకి చెందినవారమైన మనమంతా తెలుగువారము,మన మంతా భరతమాత ముద్దు బిడ్డలమంటూ దేశ సమగ్రత -జాతీయతని చాలా చక్కగా వివరించారు .తదుపరి Dr.ప్రసాద్ తోటకూర యుగ పురుషుడు వీరేశలింగం శతవర్ధంతి అనే అంశంపైన మాట్లాడుతూ వీరేశలింగం సమాజంలో తీసుకువచ్చిన సంఘ సంస్కరణల గురుంచి వివరించారు. తర్వాత Dr.నందిని సిద్దా రెడ్డి సాహిత్యం -మానవ సంబంధాలు అనే అంశం మీద మాట్లాడారు .Dr సుధా కల్వగుంట్ల వారి లాస్య సుధా డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో వారి బృందం హనుమాన్ చాలీసా ని నాట్యంతో ప్రదర్శించి చూపారు.ఈ కార్యక్రమానికి కుమారి కీర్తన కల్వగుంట్ల కొరియో గ్రాఫర్ గాను , కుమారి నర్తన కల్వగుంట్ల కో ఆర్డినేటర్ గాను వ్యవహరించారు.ఆ తర్వాత నంది అవార్డ్ గ్రహీత బగాది రామచంద్ర నాయుడు బృందం సత్యహరిచంద్ర నాటకంలోని కాటిసీను ను ప్రదర్శించి సాహిత్య ప్రియులను మెప్పించినారు .ఈ నాటకంలో చంద్రమతి గా స్థానికులైన కిరణ్మయి వేముల చక్కగా నటించారు. నాట్యాంజలి డ్యాన్స్ అకాడమీ,లతా సూరి వారి బృందం అన్నమయ్య పద లాస్య మాలిక అనే నాట్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య వేదిక పూర్వ సభ్యులని,పోషక దాతలని,విచ్చేసిన అతిథులందరినీ గుర్తించి జ్ఞాపిక , దుశ్శలువాతో గౌరవించడం జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, మన టి.వి, టీవీ 9,టి.ఎన్.ఐ,ఏక్ నజర్,దేసిప్లాజా,వెంకట్ మీడియా వారికి కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. ఈ కార్యక్రమం అధ్యక్షుడు చినసత్యం ప్రసంగంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి సాహిత్య వేదిక సదస్సు సమన్వయకర్త కృష్ణా రెడ్డి కోడూరు,అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉపాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి ,కోశాధికారి శరత్ యర్రం,సహ కార్యదర్శి ప్రబంద్ తోపుదుర్తి,పాలకమండలి అధిపతి NMS రెడ్డి,సాహిత్య వేదిక కమిటీ సభ్యురాలు స్వర్ణ అట్లూరి ,కార్యవర్గ సభ్యులు,సతీష్ బండారు,లోకేష్ నాయుడు,హరీష్, పూర్వాధ్యక్షులు Dr.ఊర్మిండి నరసింహా రెడ్డి,సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ,పాలకమండలి పూర్వాధిపతి రామ కృష్ణా రెడ్డి,చంద్ర కన్నెగంటి, భాస్కర్, సాంబ దొడ్డ,మురళీ వెన్నం,సి ఆర్ రావు,రాఘవేంద్ర ,రమేష్ సీరా,చంద్రహాస్,అనంత్ మల్లవరపు ,లెనిన్ వేముల,కిరణ్మయి వేముల,జ్యోతి వనం,వాణి గజ్జెల,అమర్ నాధ రెడ్డి తరిమెల,మంజుల కన్నెగంటి,కళ్యాణ్,భాను ఇవటూరి,సురేష్ మండువ,రావు కలువల,సేనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం సిల్వేరి ,అనురాధ సిరిగిన,శ్రీనివాస్ సిరిగిన,డాక్టర్ ఇస్మాయిల్ ,పరిమళ మార్పాక గారితో పాటు అనేక మంది సాహిత్య ప్రియులు పాల్గొని, సభికుల హర్షద్వానాల మధ్య సాహిత్య వేదిక 12 వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసారు.
TANTEX 114 Nela Nela Telugu Vennal NNTV On Veeresalingam