* బేగంపేటలోని లైఫ్ స్టైల్ భవనంలో అగ్నిప్రమాదం
బేగంపేటలోని లైఫ్ స్టైల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులోని ఓ హోటల్ కిచెన్‌లో గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన భవనం నిర్వహణ సిబ్బంది.. మంటలను కొంతమేర అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని భవనాన్ని ఖాళీ చేయించి.. మంటలను పూర్తిగా ఆర్పివేశారు. గ్యాస్ లీకేజీ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధరించారు.
* ఎల్బీనగర్‌లో ఓ డబుల్ ధమాకా దొంగతనం
హైదరాబాద్ మహానగరంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దొంగతనం జరగడం పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా సిటీ శివారు కాలనీల్లో చోరీలు ఎక్కువగా జరుతున్నాయి. అయితే ఎల్బీనగర్‌లో ఓ డబుల్ ధమాకా దొంగతనం జరిగింది. సహజంగా ఓ ఇంట్లో ఒక్కసారే దొంగతనం చేస్తారు. కానీ ఈ దొంగకు ఆ షాపు నచ్చిందో.. లేక మొదటి సారి ఎక్కువ మొత్తంలో సొత్తు దొరికిందో తెలియదు కానీ రెండోసారి కూడా అదే దుకాణానికి చోరీకి వెళ్లాడు. షాపు యజమాని దృష్టి మళ్లించి రూ.10 వేల నగదును దొంగిలించి పరుగు అందుకున్నాడు. అప్రమత్తమైన దుకాణదారుడు గట్టిగా కేకలు పెడుతూ దొంగ వెంటపడ్డాడు. స్థానికులు సైతం అలర్ట్ అయ్యి దొంగను వెంబడించి పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
* ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటన
ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్ ట్యాంకర్, ములుగు జిల్లా పస్రా నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు.. నీరుకుళ్ల శివారులోని జరిపోతుల వాగు మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. ఆత్మకూరు సీఐ రవిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో మేడారం వెళ్లే భక్తులు గంటన్నరపాటు ఇబ్బందులు పడ్డారు.
* అబిడ్స్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. 16 మంది యువతులు.. ఆరుగురు విటులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా నగరంలోని అబిడ్స్‌లో ఉన్న ఫార్చ్యూన్ లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం ఫార్చ్యూన్ లాడ్జిలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు 16 మంది యువతులను.. ఆరుగురు విటులను అరెస్ట్ చేసి వారిని రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* కోరుట్లలో సీఐడీ అధికారుల సోదాలు
జగిత్యాల జిల్లా కోరుట్ల(Korutla)లో శుక్రవారం హైదరాబాద్ సీఐడీ అధికారులు(CID officials) పలువురు పాస్‌పోర్టు ఏజెంట్‌ల ఇళ్లపై దాడులు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు కోరుట్లకు చేరుకున్న సీఐడీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక పోలీసుల సాయంతో ముగ్గురు పాస్‌పోర్ట్ ఏజెంట్ల ఇళ్లలో సోదాలు చేశారు.హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో కోరుట్లకు చెందిన ముగ్గురు పాస్‌పోర్టు ఏజెంట్లపై నమోదైన కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా అధికారులు వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారుల సోదాల్లో పలు నకిలీ పాస్‌పోర్ట్‌లు(Fake passports), పాస్‌పోర్ట్ మార్ఫింగ్‌కు సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పట్టణానికి చెందిన ముగ్గురు పాస్‌పోర్టు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాల్లో సీఐడీ డీఎస్పీలు నందిరామ్, సంపత్, వెంకటేశ్వర్లు, రవీందర్, పది మంది సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
* లేడీ లెక్చరర్‌పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సమయంలో సహాధ్యాయురాలిపై లైంగిక వేధింపులు చేయడమే కాక నిత్యం ఇబ్బందుల గురి చేస్తున్న ఓ ప్రబుద్ధుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న విజయ నాయక్ గత రెండు సంవత్సరాలుగా ఇదే కళాశాలలో పని చేస్తున్న సహాధ్యాయురాయులపై లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా నిత్యం సోషల్ మీడియా వేదికగా పలు మెసేజ్‌లతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో విసుకుచెందిన అధ్యాపకురాలు ఇదే శాఖలోని ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసింది. అయినప్పటికీ తన తీరును మార్చుకోకపోవడంతో విసుగు చెందిన అధ్యాపకురాలు గత సంవత్సరం అక్టోబర్ 29న హాలియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు వెంటనే విజయ్ నాయక్ పై ఐపీసీ 354 ఏ, 354 డి సెక్షన్ల కింద ప్రాథమిక ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. దీంతో సుమారు 25 రోజుల పాటు పరారీలో ఉన్న విజయ నాయక్ హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు.తన కళాశాలలో పనిచేస్తున్న తోటి అధ్యాపకురాలు పై గత రెండు సంవత్సరాలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్న విజయ నాయక్ పై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వరంగల్ డీఐఈఓ గతంలో విచారణ చేశారు. విచారణలో వాస్తవాలు వెల్లడి కావడంతో గతంలో ఉన్న రాష్ట్ర ఉన్నతాధికారులను మేనేజ్ చేసుకుని తిరిగి వేధింపులకు గురి చేసేవాడు. ప్రిన్సిపాల్ వేధింపులను తట్టుకోలేని అధ్యాపకురాలు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన కమిషనర్ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో తిరిగి విజయ నాయక్ పై విచారణ చేశారు. విజయ నాయక్ పై వచ్చిన ఆరోపణలతో గురువారం సాయంత్రం ఆర్జెడి విజయ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.2018లో హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలుగా చేరిన తనను 2021 లో ప్రిన్సిపాల్‌గా ఇక్కడికి వచ్చిన విజయ నాయక్ పలుమార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని బాధిత ఉపాధ్యాయురాలు వాపోయారు. సోషల్ మీడియా వేదికగా పలుమార్లు అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నాడని తీరు మార్చుకోమని పలుమార్లు వారించినప్పటికీ వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు తాళలేక ఉన్నతాధికారులతో పాటు హాలియా పోలీస్ స్టేషన్‌లో గత సంవత్సరం అక్టోబర్‌లో ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని బాధితురాలు పేర్కొన్నారు.హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సహధ్యాయురాలపై లైంగిక ఆరోపణలు చేశారన్న నేపంతో హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ నాయక్‌ను సస్పెండ్ చేసిన విషయం వాస్తవమే. విజయ్ నాయక్ పై వచ్చిన ఆరోపణలపై గతంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారుల విచారణలో ఆరోపణలు వెల్లడి కావడంతో సస్పెన్షన్ చేశాము.
* ప్రేమించాలంటూ బాలికపై కత్తితో దాడి
ప్రేమించాలంటూ కొన్నాళ్లుగా పదో తరగితి బాలిక వెంటపడిన నిందితుడు అందుకు ఒప్పు కోకపోవడంతో కత్తితో దాడి (Attacked girl )చేశాడు. ఆపై తాను రైలు(Train) కిందపడి ఆత్మహత్య(Committed suicide)కు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రమణ అనే నిందితుడు ఓ బాలికను ప్రేమించాలని వెంటపడి వేధించాడు. అందుకు బాలిక ఒప్పుకోలేదు.దీంతో ప్రేమను నిరాకరిస్తుందనే కోపంతో గురువారం ట్యూషన్‌లో ఉన్న బాలికపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన ట్యూషన్ టీచర్‌పైనా దాడి చేసి రమణ పరారయ్యాడు. దాడిలో గాయపడిన బాలిక, ట్యూషన్ టీచర్‌ను దవాఖానకు తరలించారు. కాగా, రమణ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం విద్యానగర్ (Vidhyanagar) సమీపంలో రైలుపట్టాలపై రమణ మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉 – Please join our whatsapp channel here –