భారతదేశంలో డిజిటల్ విప్లవం కొనసాగుతుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వాడకం పెరగడంతో ప్రతి ఫోన్‌లో డేటా రీచార్జ అనేది తప్పనిసరైంది. గతంలో ఈ డేటా చార్జీలు చాలా దారుణంగా ఉండేవి. అయితే టెలికాం మార్కెట్‌లో జియో ఎంట్రీతో డేటా చార్జీలు సగటు వినియోగదారుడికి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం డేటా వినియోగంలో భారతదేశం ప్రపంచ దేశాల సరసన నిలిచింది. ఇటీవల కాలంలో టెలికాం రంగంలో విపరీతమైన పోటీ కారణంగా అన్ని కంపెనీలు తమ ప్లాన్స్‌పై అధిక డేటా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో వీఐ చేరింది. వోడాఫోన్ ఐడియా తన డేటా ప్లాన్ ధర రూ.181తో మరిన్ని డేటాను అందిస్తుంది. ఈ తాజా ఆఫర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
వోడాఫోన్ ఐడియా రూ. 181 డేటా ప్లాన్‌తో రోజుకు 1 జీబీ డేటాతో పాటు రోజుకు 0.5 జీబీ డేటాను అందిస్తోంది. డేటా మాత్రమే కాకుండా 30 రోజుల చెల్లుబాటును కూడా అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ ఎలాంటి వాయిస్ కాల్ లేదా ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలను అందించదు. ఈ ప్లాన్ ఇప్పటికే యాక్టివేషన్ కలిగి ఉన్న ఇతర డేటా ప్యాక్‌తో కలిపి వినియోగించుకోవాలి.
వీఐ కూడా ఇటీవల తన అంతర్జాతీయ రోమింగ్ (ఐఆర్) ప్లాన్‌తో మొబైల్ డేటా మరియు వాయిస్ కాల్‌లను అందించే దేశాల జాబితాలో ఇటీవల మాల్దీవులను చేర్చింది. దీని ప్రకారం వీఐ 100 నిమిషాల (అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్), 5 జీబీ డేటా , 10 అవుట్‌గోయింగ్ ఎస్‌ఎంఎస్, ఉచిత ఇన్‌కమింగ్ ఎస్‌ఎంఎస్, 10 రోజుల చెల్లుబాటును అందించే రూ. 2,999 ధరతో కొత్త ‘మాల్దీవుల ప్లాన్’ను ప్రారంభించింది. పోస్ట్ అవుట్‌గోయింగ్ నిమిషాలు, ఇన్‌కమింగ్ కనీస కోటా, మొబైల్ కాల్‌లకు నిమిషానికి రూ. 3, మిగిలిన ప్రపంచ మొబైల్ కాల్‌లకు నిమిషానికి రూ. 35, డేటా పోస్ట్ కోటా కోసం ఒక్కో ఎంబీకు రూ. 1, ఎస్‌ఎంఎస్ పోస్ట్ కోటా కోసమైతే ప్రతి ఎస్‌ఎంఎస్ ధరలు రూ. 1గా ఉంటాయి.
👉 – Please join our whatsapp channel here –