NRI-NRT

తానా ఫౌండేషన్ ట్రస్టీగా సూరపనేని రాజా గెలుపు

తానా ఫౌండేషన్ ట్రస్టీగా సూరపనేని రాజా గెలుపు

2023 తానా ఎన్నికల్లో తానా ఫౌండేషన్ ట్రస్టీగా సెయింట్ లూయిస్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు సూరపనేని రాజా గెలుపొందారు. కృష్ణా జిల్లా పెనుమత్సకు చెందిన ఆయన గత 30ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. తానాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆయన గతంలో తన నామినేషన్ ఉపసంహరించుకుని తానాకు లక్ష డాలర్లను ఆదా చేశారు. ఈ పర్యాయం బరిలో దిగి విజయబావుటా ఎగురవేశారు. ఆయన విజయం పట్ల తెదేపా నేత కేశినేని చిన్ని హర్షం వెలిబుచ్చారు. తన చిన్ననాటి మిత్రుడి గెలుపుతో తానా సేవా కార్యక్రమాల పరిధి మరింత విస్తృతమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. తానా ఫౌండేషన్‌కు విరాళాల సేకరణ, వాటి సఫలీకృత వినియోగానికి శాయశక్తులా కృషి చేస్తానని రాజా తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z