బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చి ఇనిస్టిట్యూట్… అత్యాధునిక మొబైల్ క్యాన్సర్ స్ర్కీనింగ్ బస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్‌ను ఆదివారం ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఎస్‌బీఐ సీజీఎం రాజే్‌షకుమార్ ప్రారంభించారు.
దీనికి సుమారు రూ.16 కోట్లు ఖర్చు కాగా, ఎస్‌బీఐ తమ సీఎస్‌ఆర్ కార్యక్రమాల్లో భాగంగా రూ.1.5కోట్ల ఆర్థిక సహాయం అందించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ బస్‌లో అత్యాధునిక డిజిటల్ ఎక్స్‌రే, మామోగ్రఫీ, అలా్ట్రసౌండ్ యంత్రాలతో పాటు క్యాన్సర్ నిర్ధారణకు ప్రాఽథమిక పరీక్షలు నిర్వహించి, పరీక్షా ఫలితాలను వెనువెంటనే అందించేలా అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వివరించాయి.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ దేశంలో ఇటువంటి ప్రత్యేకమైన బస్‌ను కలిగిన సంస్థ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి మాత్రమేనని అన్నారు. దీనికి రోటరీ క్లబ్, పలువురు దాతలు సహాయం చేశారన్నారు. పలువురు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకురారని, అలాంటి వారికి ఇంటి వద్దనే స్ర్కీనింగ్ చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z