*ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 పీసీ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై విండోస్ 10 ఓఎస్ ఉన్న పీసీల్లో అమెజాన్ అలెక్సాకు సపోర్ట్ లభించనుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ డిజిటల్ అసిస్టెంట్ కార్టానా విండోస్ 10 పీసీల్లో అందుబాటులో ఉండగా.. దానికి అమెజాన్ అలెక్సా అదనం కానుంది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను విండోస్ 10 ఇన్‌సైడర్ ప్రివ్యూ బిల్డ్ ఓఎస్‌లో అందిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో విండోస్ 10 యూజర్లందరికీ అమెజాన్ అలెక్సా లభ్యం కానుంది. దీంతో అమెజాన్ ఎకో డివైస్‌లను ఉపయోగించినట్లుగానే యూజర్లు విండోస్ 10 పీసీలను ఉపయోగించుకోవచ్చు..!
* ప్రముఖ రిటైల్ బ్రాండ్ వాల్‌మార్ట్ ఇండియా తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో మూడవ క్యాష్ అండ్ క్యారీ స్టోర్‌ను నిజామాబాద్‌లో ప్రారంభించింది. ఇప్పటికే వాల్‌మార్ట్ ఇండియాకు హైదరాబాద్, కరీంనగర్‌లో స్టోర్లున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ముగింపు నాటికి వరంగల్‌లో నాల్గవ స్టోర్‌ను ప్రారంభిస్తామని ఇండియా సీఈఓ అండ్ ప్రెసిడెంట్ క్రిష్ అయ్యర్ తెలిపారు. ఇప్పటివరకు వాల్‌మార్ట్ ఇండియాకు దేశంలో 26 స్టోర్లున్నాయి. నిజామాబాద్‌లో 50 వేల చ.అ.ల్లో విస్తరించి ఉన్న ఈ స్టోర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రిటైలర్లు, రైతులకు, సప్లయర్స్ వంటి బీ2బీ విభాగంలో ఈ స్టోర్ సేవలందిస్తుందని చెప్పారు.
*నేడు దలాల్ స్ట్రీట్‌లో మార్కెట్ సూచీలు గురువారం నిరాశజనకంగా కనిపించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు,ఆటోమొబైల్ రంగాల్లో షేర్ల అమ్మకాలు భారీగా జరిగాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు తగ్గి 38,897 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్ సూచీలో వెనుకబడిన సంస్థలలో యస్‌బ్యాంకు, టాటామోటార్సు, ఓన్‌జీసీ, మారుతి సంస్థలు ఉన్నాయి. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 11,597 పాయింట్ల వద్దట్రేడింగ్ ముగించింది. యస్‌బ్యాంకు షేరు 15 శాతం తగ్గి షేరు విలువ కోల్పోయింది. ఏప్రిల్ 21, 2014 సంవత్సరం నుంచి అత్యల్ప షేరు ధర ఇదీ.. మైండ్‌ట్రీ సంస్థ షేరు విలువ 10 శాతం పడిపోయి, రూ.675 ల వద్ద స్థిరపడ్డాయి. గత 52 వారాలలో ఆ సంస్థ షేరు విలువ తక్కువగా ట్రేడ్ అవ్వటం ఇదే మొదటిసారి.
*దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నీతి ఆయోగ్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మూడు లిథియం అయాన్ బ్యాటరీల సంస్థలు తెలంగాణలో తమ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
*కృష్ణా గోదావరి బేసిన్లోని 3 సహజవాయువు క్షేత్రాలపై 2022 వరకు రూ.35,000కోట్ల (5 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ భాగస్వామి బీపీ పీఎల్సీ సన్నద్ధమవుతున్నాయి.
*మధ్య స్థాయి ఐటీ సంస్థ అయిన మైండ్ ట్రీ ఆర్థిక ఫలితాల్లో నిరాశపరిచింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 41.4 శాతం తగ్గి రూ.92.7 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.158.2 కోట్లకు చేరింది.
* తెలంగాణలో వాల్మార్ట్ ఇండియా తన మూడో అతిపెద్ద క్యాష్ అండ్ క్యారీ స్టోరు ‘బెస్ట్ ప్రైస్ మోడర్న్ హోల్సేల్ స్టోర్’ను నిజామాబాద్లో ప్రారంభించింది. జిల్లా కేంద్రంలోని బోర్గాం(పి) వద్ద ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను బుధవారం సంస్థ సీఈఓ క్రిష్ అయ్యర్ ప్రారంభించారు.
*ప్రభుత్వరంగంలో ఉన్న నాలుగు ఔషధ కంపెనీల్లో రెండింటిని పూర్తిగా మూసి వేయాలని, మరో రెండింటిని వ్యూహాత్మకంగా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
*రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఎంత పరిమాణంలో తన వద్ద మూలధన నిల్వలను ఉంచుకోవాలో తెలియజెప్పేందుకు ఏర్పాటు చేసిన జలాన్ కమిటీ తన నివేదికకు తుదిరూపునిచ్చినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీని డిసెంబరు 26, 2018న నియమించిన సంగతి తెలిసిందే.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి త్రైమాసికంలో ప్రైవేటు రంగానికి చెందిన యెస్ బ్యాంక్కు మొండి బకాయిల బెడద కొనసాగింది. ఏకీకృత ప్రాతిపదికన రూ.95.56 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ప్లాస్టిక్ పైపులు, ఫిట్టింగులను ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎస్ఐఎల్ తెలంగాణ సంగారెడ్డి సమీపంలో నిర్మించిన ప్లాంటును మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. హింద్వేర్ ట్రూఫ్లో పేరుతో ఇక్కడ పలు రకాల పైపులు, ఫిట్టింగులను సంస్థ ఉత్పత్తి చేస్తోంది.
*సూచీలు పెరిగినప్పటికీ ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ప్రకటించడంతో డీసీబీ బ్యాంక్ షేరు డీలా పడింది. బ్యాంకు అందించిన మొత్తం రుణాల్లో మొండి బకాయిల నిష్పత్తి పెరిగిపోవడం మదుపర్లకు రుచించలేదు.
*ఫేస్బుక్, టీ-హబ్ సంయుక్తంగా చేపట్టిన ‘ఇండియా ఇన్నోవేషన్ యాక్సెలరేటర్’ కార్యక్రమానికి ప్రధానంగా కృత్రిమ మేథస్సు (ఏఐ) విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న 10 అంకుర సంస్థలను ఎంపిక చేశారు.
*బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని 10% నుంచి 12.5 శాతానికి పెంచుతూ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్న వెంటనే, దొంగచాటుగా తేవడాన్ని (స్మగ్లింగ్) నిరోధించేందుకూ తనిఖీలను ముమ్మరం చేశారు.
నిజామాబాద్లో వాల్‌మార్ట్ ప్రారంభం-వాణిజ్య-07/19
Related tags :