* కర్ణాటక రాష్ట్ర మండ్య జిల్లాలో ఉపాధ్యాయురాలు దారుణ హత్యకు గురయ్యారు. విధులకు వెళ్లిన టీచర్.. విగతజీవిగా కనిపించారు. వివరాలు.. మేలుకోటె ఎస్ఈటీ పబ్లిక్ పాఠశాలలో మాణిక్యనహళ్లికి చెందిన దీపిక అనే మహిళా ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమెకు భర్త లకేష్.. ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు.
* శానిటరీ ప్యాడ్‌లో అక్రమంగా బంగారం తరలిస్తూ ఓ మహిళా ప్రయాణికురాలు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికురాలి నుంచి 73 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 49 లక్షల విలువ చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ బంగారాన్ని శానిటరీ ప్యాడ్‌లో దాచి ఉంచినట్లు తెలిపారు. అబుదాబి నుంచి ఓ ప్రయాణికురాలు శానిటరీ ప్యాడ్‌లో బంగారాన్ని తరలిస్తున్నట్లు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఫ్లైట్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే, ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం మహిళా ప్రయాణికురాలి వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్‌ను పేస్ట్ రూపంలో తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
* మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్ (20) మృతి చెందాడు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్లగొండ జిల్లాకు తరలించారు.
* అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం వరకు చీమ చిటుక్కుమన్నా పట్టేసిన పోలీసులు.. ప్రాణ ప్రతిష్ఠ వేడుకు ముగిసిన తర్వాత బాగా రిలాక్స్ అయ్యారు.. హై సెక్యూరిటీ అంతా మాయం అయ్యింది.. లోకల్ పోలీసులు కూడా కొంచెం సేదతీరారు. దీంతో రెండో రోజు అయోధ్య రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తుల తోపులాటలు జరిగాయి. ఇదే అదునుగా దొంగల చెలరేగిపోయారు.. దొంగతనాలకు పాల్పడ్డారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం వరకు భారీ భద్రతను ఏర్పాటు చేసిన యూపీ సర్కార్ ఇపుడు పూర్తిగా చేతులెత్తేసింది. జనవరి 23 నుంచి అయోధ్యలో భక్తులకు ఎంట్రీ ఇవ్వడంతో అయోధ్య రామ్ లల్లా దర్శనం కోసం భక్తులతో కిక్కిరిసిపోయింది. భద్రతను పెంచాల్సిన పోలీసులు అయోధ్య పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించారు. దీంతో వందలాది భక్తుల మోబైల్స్… పర్సులు… బంగారం చోరీకి పాల్పడ్డారు దొంగలు. స్థానిక పోలీస్ స్టేషన్లో భక్తులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. భక్తుల నుంచి ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు పోలీసులు. దీంతో విలువైన వస్తువులు కోల్పోతున్నామని అయోధ్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z