NRI-NRT

సౌదీ అరేబియాలో సంక్రాంతి ముగ్గుల పోటీ

సౌదీ అరేబియాలో సంక్రాంతి ముగ్గుల పోటీ

సౌదీ అరేబియా దేశం జెద్దా నగరంలో “జెద్దా తెలుగు మిత్రులు(JTM)” ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిపారు. పెద్దసంఖ్యలో ప్రవాసులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ అలంకరణలు, సాంప్రదాయ దుస్తులు ఆకట్టుకున్నాయి. చిన్నారులకు భోగిపళ్లు పోశారు. సంక్రాంతి ముగ్గుల పోటీలలో మహిళలు అందమైన చుక్కల ముగ్గులు వేశారు. సంక్రాంతి బొమ్మల కులువు ఆకర్షించింది. చిన్న పిల్లలకు వేమన శతకాలు పోటీలు.. సంక్రాతి విశేషాలు గురుంచి మాట్లాడటం వంటి పోటీలు రసవత్తరంగా సాగాయి. ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, చిత్రలేఖనం, గాలిపటం తయారీ వంటి పోటీలు కూడా నిర్వహించారు. విందు భోజనాన్ని అతిథులు ఆస్వాదించారు.

JTM కార్యవర్గ సభ్యులు :
గాలి దుర్గాభవాని, సోడగం వెంకట్ , సోడగం అనురాధ , గోలి శ్రీనివాస్, కొరుపాలు రజనీ శ్రీహరి, వికటకవి కిషోర్ , వికటకవి సుప్రియ , కుంట సాగర్ కుమార్ , గాదిరాజు రామసీత , గాదిరాజు భారతి , బ్రహ్మాండం శారద , పడమట కోటి శివ రామకృష్ణ.






👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z