* ఆస్ట్రేలియా (Australia)లో విషాదం చోటు చేసుకుంది. బీచ్‌కు వెళ్లిన నలుగురు భారతీయులు (Four Indians) నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా (Victoria) రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్‌కు చెందిన బీచ్ (Philip Island beach) వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిపోతున్న నలుగురిని గుర్తించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ముగ్గరు మరణించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరొకరిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు హహిళలు. ఈ ఘటనపై కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్ స్పందించింది. ఘటనకు గానూ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలియజేసింది.
* నాగరిక సమాజంలో అనాగరిక చర్యకు పాల్పడింది ఓ కుటుంబం. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ బాలుడిని మూఢనమ్మకానికి బలి చేసింది. గంగా నదిలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని భావించిన ఓ మహిళ.. చిన్నారిని నీటిలో కొంతసేపు ఉంచింది. ఆ తర్వాత బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ ఐదేండ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. దీంతో ఢిల్లీలోని పేరొందిన ఆస్పత్రుల్లో బాలుడికి చికిత్స చేయించారు. కానీ క్యాన్సర్ ముదిరిందని, బాలుడిని ప్రాణాలతో కాపాడటం కష్టమని చెప్పి డాక్టర్లు చేతులేత్తెశారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. గంగా నదిలో బాలుడిని ముంచితే క్యాన్సర్ నయమవుతుందని అతని అత్త నమ్మింది. దీంతో బాలుడితో పాటు ఆ చిన్నారి తల్లిదండ్రులను తీసుకొని హరిద్వార్‌కు బయల్దేరింది. గంగా నది వద్దకు చేరుకున్నారు. ఇక తల్లిదండ్రులు గంగా నదికి పూజలు చేస్తుండగా, ఆ చల్లని నీటిలో బాలుడిని అత్త ముంచింది. దాదాపు 15 నిమిషాల పాటు బాలుడు నీటిలోనే ఉండిపోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు ఆమెను నిలదీశారు. బాలుడిని నీటిలో నుంచి పైకి తీయాలని అత్తను డిమాండ్ చేశారు. కానీ ఆమె వినిపించుకోలేదు. చివరకు స్థానికులు బలవంతం చేయడంతో నీటిలో నుంచి బాలుడిని బయటకు తీసింది. అప్పటికే అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాలుడు.. మేల్కొంటాడని అత్త అమాయకంగా మాట్లాడింది. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని, బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడికి చికిత్స అందించిన ఢిల్లీ హాస్పిటల్ నుంచి నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామన్నారు.
* నార్సింగిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మై హోమ్ అవతార్ బిల్డింగ్ సమీపంలో బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. దీంతో కారు డ్రైవర్ పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడిని విజయ్‌గా పోలీసులు గుర్తించారు. బైక్‌ను కొద్దిదూరం కారు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ తెలిపారు. ఏ1గా కొవ్వూరి రిత్విక్‌రెడ్డి, వైష్ణవి (ఏ2), పొలుసాని లోకేశ్వర్‌రావు (ఏ3), బుల్లా అభిలాష్ (ఏ4), ఏ5గా అనికేత్‌ను పేర్కొన్నట్లు చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు.
‘‘హిట్ అండ్ రన్ కేసులో తారక్‌రామ్ అక్కడికక్కడే మృతిచెందారు. ఏసు రాజుకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు పట్టుకుంటారనే భయంతో రిత్విక్‌రెడ్డి పరారయ్యాడు. స్నేహితుడు సురేష్‌రెడ్డి ఇంట్లో కారును దాచిపెట్టారు. రిత్విక్ అమెజాన్‌లో జాబ్ చేస్తున్నాడు. ఆఫీస్ చూపిస్తానని స్నేహితులను తీసుకెళ్లాడు. మద్యం మత్తులో అతడు కారు నడిపినట్లు దర్యాప్తులో తేలింది. అందులో ప్రయాణించిన వారిని కూడా నిందితులుగా చేర్చాం. రిత్విక్రెడ్డిపై సెక్షన్ 304 (2) కింద.. మిగిలిన వారిపై 337 ఐపీసీ, 337, 187 ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం’’ అని ఏసీపీ వివరించారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ గాంధీనగర్‌లో నివసించే లింగాల తారక్‌రామ్ (30) మాదాపూర్ నోవాటెల్‌లో బౌన్సర్. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు విధులు ముగించుకుని మరో బౌన్సర్ రాజుతో కలిసి జూబ్లీహిల్స్ మీదుగా బైకుపై గాంధీనగర్ బయల్దేరారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. తారక్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. రాజును అటుగా వెళ్తున్న వాహనదారులు 108లో ఆసుపత్రికి తరలించారు. టీఆర్ నంబరుతో ఉన్న కారు ద్వారంపూడి నాగ పేరుతో ఉన్నట్లు సమాచారం. తారక్‌రామ్‌కు రెండేళ్ల క్రితం సుధారాణితో వివాహం కాగా 7 నెలల కుమారుడున్నాడు. ఉస్మానియాలో శవపంచనామా అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ఠాణా ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ అతడి బంధువులు, బౌన్సర్లు నినాదాలు చేశారు. ఈ ఘటనకు కారు కారణంగా తాము భావిస్తున్నామని ఆరోపించారు. ప్రమాదానికి పాల్పడింది ఓ నాయకుడి కుమారుడని, నిజాలు వెల్లడించాలంటూ డిమాండ్ చేశారు.
* ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. షాజహాన్‌పుర్ జిల్లాలో ఆటోను ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. దట్టమైన మంచు కారణంగా గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z