NRI-NRT

డల్లాస్‌లో ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు

డల్లాస్‌లో ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ నగరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. బి. ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎందరో మేధావులు ఎంతో సమయం వెచ్చించి, శ్రమకోర్చి భారత రాజ్యాంగాన్ని తయారుచేసి మనకు అందించారని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరిడిపైన ఉంది.” అన్నారు.

ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రూపొందించిన నేతలకు, మన భారతదేశ స్వాతంత్ర్యసిద్ధికి పాటుపడిన మహాత్మాగాంధి, జవహర్లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, మౌలానా అబుల్ కలం ఆజాద్ మొదలైన నాయకులకు, దేశ స్వాతంత్ర్యం కోసం అశువులు బాసిన స్వాతంత్ర్య సమరయోధులకు ప్రవాసభారతీయులు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వాల, రాజీవ్, బి.ఎన్, జగదీష్, నవాజ్, జస్టిన్, షబ్నం మోడ్గిల్, వివిధ భారతీయసంస్థల నాయకులతో పాటు ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z