వరుసగా రెండో రోజు సైతం బంగారం ధర స్థిరంగా ఉంది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ఆదివారంతో పోలిస్తే బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,700 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా వెండి ధరలోనూ ఎలాంటి హెచ్చుతగ్గులు చోటు చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,700 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950గా ఉంది.
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,100 వద్ద కొనసాగుతుంది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950 వద్ద కొనసాగుతుంది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,400 వద్ద కొనసాగుతుండగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.63,710గా నమోదైంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z