భారత నౌకాదళం మరోసారి సత్తా చాటింది. సోమాలియా సముద్ర దొంగల చెర నుంచి ఇరాన్‌కు చెందిన 17 మంది మత్స్యకారులను రక్షించింది. ఈ విషయాన్ని నేవీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. తూర్పు తీరంలోని సోమాలియా, గల్ఫ్ ఆఫ్ ఈడెన్‌లో పహారా కాస్తున్న ఐఎన్‌ఎస్ సుమిత్ర యుద్ధ నౌకకు ఇరాన్ మత్స్యకారుల పడవ (ఐమ్యాన్) నుంచి రక్షించాలి అనే సమాచారం అందింది. సముద్రపు దొంగలు తమ పడవను స్వాధీనం చేసుకుని తమను బందీలుగా మార్చేశారని, కాపాడాలని కోరడంతో సుమిత్ర వెంటనే అక్కడికి చేరుకుంది. బోటుతో పాటు బందీలుగా చిక్కుకున్న 17 మంది మత్స్యకారులను విడిపించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z