మలేషియాలోని కౌలాలంపూర్ సిటీ సెంటర్లో భారత హై కమీషన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగానా సంస్కృతిని ప్రతిబింబిస్తూ మహిళలు చేసిన బతుకమ్మ ప్రదర్శన ఆకట్టుకుంది. వేడుకల్లో భారత హైకమీషనర్ బి.ఎన్.రెడ్డి, మలేషియా ఫైనాన్స్ మినిస్టర్ దాతుశ్రీ అమిర్ హాంజా, డిప్యూటీ మినిస్టర్ అఫ్ యూనిటీ సరస్వతి కందస్వామి, కులశేఖరన్, డిప్యూటీ మినిస్టర్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్,ఫెడరల్ మాజీ డిప్యూటీ మినిస్టర్ దాతో లోగ బాలమోహన్ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z