Business

₹1378కోట్ల లాభం గడించిన డా.రెడ్డీస్

₹1378కోట్ల లాభం గడించిన డా.రెడ్డీస్

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్వల్ప వృద్ధి నమోదు చేసింది. ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.7,214 కోట్ల ఆదాయంపై రూ.1,378 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) మిగులు 29.3 శాతంగా నమోదైంది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.82.68గా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.6,770 కోట్లు, నికరలాభం రూ.1,247 కోట్లుగా ఉన్నాయి. దీంతో పోలిస్తే ప్రస్తుత మూడో త్రైమాసికంలో ఆదాయం 7%, నికరలాభం 11% పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఆదాయం రూ.20,833 కోట్లు, నికరలాభం రూ.4,261 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంతో పోల్చితే ఆదాయం 14%, నికరలాభం 20% పెరిగాయి. సమీక్షా త్రైమాసికంలో అమెరికాలో అమ్మకాలు 9%, ఐరోపాలో 15% పెరిగాయి. దేశీయ మార్కెట్లో 5% వృద్ధి నమోదైంది. అమెరికాలో 2 కొత్త ఔషధాలు విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. కొన్ని రకాల క్యాన్సర్‌ వ్యాధులకు చికిత్సలో వినియోగించే లెనలిడోమైడ్‌ జనరిక్‌ మందును అమెరికాలో డాక్టర్‌ రెడ్డీస్‌ విడుదల చేసింది. ఈ మందు అమ్మకాలు పెరిగినా, ధర కొంత తగ్గిందని సమాచారం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z