Business

పేటీఎంకు RBI షాక్-వాణిజ్యం

పేటీఎంకు RBI షాక్-వాణిజ్యం

* ఆర్ధిక మంద‌గ‌మ‌నం, వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ప‌లు కంపెనీలు ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగ‌బ‌డుతున్నాయి. టెక్ దిగ్గ‌జాల నుంచి స్టార్ట‌ప్‌ల వ‌ర‌కూ అన్ని రంగాల కంపెనీలు కొలువుల కోత చేప‌డుతున్నాయి. అమెజాన్‌, గూగుల్‌, మెటా స‌హా ప‌లు కంపెనీలు పెద్ద‌సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గించ‌గా చిన్న‌, మ‌ధ్య‌స్ధాయి సంస్ధ‌లు సైతం ఉద్యోగుల‌ను వ‌దిలించుకుంటున్నాయి. ఇక రోబోటిక్ వ్యాక్యుమ్ క్లీనింగ్ సొల్యూష‌న్స్ అందించే ఐరోబోట్ కూడా లేఆఫ్స్ ప్ర‌క‌టించింది. వృద్ధి, లాభ‌దాయ‌క‌త‌ను కొన‌సాగించేందుకు పున‌ర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా కంపెనీలో 31 శాతం మంది ఉద్యోగుల‌ను దాదాపు 350 మంది ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గించ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది. వేటుకు గురయ్యే ఉద్యోగుల‌కు ప‌రిహార ప్యాకేజ్ వ‌ర్తింప‌చేయ‌నున్న‌ట్టు తెలిపింది. వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా కంపెనీ నాయ‌కత్వ విభాగంలోనూ కీల‌క మార్పులు చేప‌ట్టింది. మాజీ చైర్మ‌న్‌, సీఈవో క‌లిన్ యాంగిల్ త‌న ప‌ద‌వుల నుంచి వైదొల‌గా గ్లెన్ వీన్‌స్టిన్ ఐరోబోట్ తాత్కాలిక సీఈవోగా నియ‌మించారు. ఇండిపెండెంట్ డైరెక్ట‌ర్ ఆండ్రూ మిల్ల‌ర్ బోర్డ్ చైర్మ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

* ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (ఋఎలీంచె ఈందుస్త్రిఎస్) మరోసారి సత్తా చాటింది. భారత్‌ నుంచి అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2023 సంవత్సరానికి సంబంధించి హురున్‌ గ్లోబల్‌ ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్‌ 44వ స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి గతేడాది సైతం అగ్రస్థానంలో నిలిచిన రిలయన్స్.. ఈసారి మాత్రం 198 బిలియన్‌ డాలర్ల విలువతో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. అయితే, కంపెనీ విలువ 2 శాతం మేర క్షీణించడంతో ఓవరాల్‌ ర్యాంకుల్లో 10 స్థానాలు కోల్పోయింది.

* ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఈసారీ డిజిటల్‌ రూపంలోనే బడ్జెట్‌ కాపీని అందుబాటులోకి తీసుకురానున్న కేంద్ర ఆర్థిక శాఖ. ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్న నిర్మలా సీతారామన్‌. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకోనున్న కేంద్ర ఆర్థిక మంత్రి. ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకోనున్న నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు. బడ్జెట్‌ సమర్పణకు ముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో భేటీ కానున్న కేంద్ర కేబినెట్‌. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్‌. ఉదయం 11 గంటల నుంచి లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌.

* పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు (ఫయ్త్మ్ ఫయ్మెంత్స్ భంక్) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఋభీ) షాకిచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, వ్యాలెట్‌, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు చేపట్టకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌, బయటి ఆడిటర్ల నివేదికలను అనుసరించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఫ్ఫ్భ్ళ్)పై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘనను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది.

* దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (ంఅరుతి శుజుకి) త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో (Q3 ఋఎసుల్త్స్) ఏకీకృత ప్రాతిపదికన రూ.3,207 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,406 కోట్లతో పోలిస్తే 33శాతం అధికం. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రూ.29,251 కోట్ల నుంచి 15శాతం పెరిగి రూ.33,513 కోట్లకు చేరింది.

* ప్రపంచవ్యాప్తంగా బంగారం (ఘొల్ద్) గిరాకీ 2023లో ఐదు శాతం తగ్గి 4,448.4 టన్నులకు చేరిందని ‘ప్రపంచ స్వర్ణ మండలి (వ్ఘ్ఛ్)’ నివేదిక తెలిపింది. ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఏట్F) పెట్టుబడుల నుంచి ఉపసంహరణల వల్లే గిరాకీ తగ్గిందని వివరించింది. 2022లో 4,699 టన్నుల బంగారానికి గిరాకీ నమోదైనట్లు గుర్తు చేసింది. అత్యధికంగా ఐరోపాలో పసిడి గిరాకీ (ఘొల్ద్ డెమంద్) 180 టన్నుల మేర తగ్గింది. 2013 తర్వాత ఈ ప్రాంతంలో ఈస్థాయి క్షీణత ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్లు రాణించడం, వడ్డీరేట్ల కోత అంచనాల్లో అనిశ్చితి వల్లే పసిడి ఈటీఎఫ్‌ల (ఘొల్ద్ ఏట్Fస్) నుంచి పెట్టుబడుల ఉపసంహరణ పెద్దఎత్తున నమోదైందని డబ్ల్యూజీసీ నివేదిక వివరించింది. కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు వార్షిక ప్రాతిపదికన 45 టన్నులు తగ్గి 1,037 టన్నులకు చేరింది. అత్యధికంగా పీపుల్స్‌ బ్యాంక్ ఆఫ్ చైనా 225 టన్నులు, బ్యాంక్‌ ఆఫ్ పోలెండ్‌ 130 టన్నుల బంగారాన్ని తమ నిల్వల్లో చేర్చుకున్నాయని వెల్లడించింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఉజ్బెకిస్థాన్‌, నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కజకిస్థాన్‌ అత్యధికంగా విక్రయించాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z