* ఎక్సైజ్ పాలసీ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఐదుసార్లు తమ సమన్లును బేఖాతారు చేశారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారంనాడు ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 17న హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జై భారత్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. వైసీపీ ఎన్నికల ప్రచార బడ్జెట్‌లా ఉందని విమర్శించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. బడ్జెట్ సెషన్‌ను వైసీపీ ఎన్నికల ప్రచార పర్వంలా మార్చేశారని ఫైర్ అయ్యారు. రూ. 4.25 లక్షల కోట్ల నగదు బదిలీతో పేదరికం తొలగించామని ఆర్ధిక మంత్రి ఆత్మవంచన చేసుకున్నారని విమర్శించారు లక్ష్మీనారాయణ. అప్పులు చేసి డబ్బులు పంచితే, అది పేదరిక నిర్మూలన ఎలా అవుతుంది? అని నిలదీశారు. 43 లక్షల మంది విద్యార్థులకు గోరు ముద్ద, 35 లక్షల మంది పిల్లలకు సంపూర్ణ పోషణ అని లెక్కలు చెప్పారని, మరి ఇందులో వాస్తవమెంత? అని ప్రశ్నించారాయన.
* పచ్చదనం(greenary) పెంపు పనులు నిరంతరం కొనసాగించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో హరితనిధి విరాళాలు, ఖర్చుల పై అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరిత నిధి కేటాయింపులు, ఖర్చుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. పూర్తయిన పనుల ఆడిట్ నివేదికలు పునఃపరిశీలించాలని సూచించారు. కాగా, 2021 నుంచి హరిత నిధికి రూ.69.21 కోట్ల విరాళాలు, రూ.43 కోట్ల మేర పనులు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
* ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉండగా చేసిన పాదయాత్ర విశేషాలతో తెరకెక్కిన మూవీ యాత్ర2. గతంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ను బేస్ చేసుకుని తీసిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా ఈమూవీ తెరకెక్కింది. యాత్రలో .. ఇప్పుడు యాత్రా2 లో రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషించగా..ఈమూలో వైఎస్ జగన్ పాత్రను జీవ పోషించారు. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన యాత్ర2 మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజవుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు నిర్మించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్థాయిలోనే థియేటర్లు దక్కాయి. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ సర్టిఫికెట్ వచ్చింది. కాని ఈూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం పెద్దగా రాలేదు. డైరెక్ట్ బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయి అని నమ్మకంతో ఉన్నారు టీమ్. ఇక ప్రస్తుతం ఈసినిమాకుసబంధిచిన కాంట్రవర్సీలతో పాటు మరో విషయం కూడా వైరల్అవుతుంది. అదేంటంటే.. ఈసినిమాకు గాను రెమ్యూనరేషన్లు ఎంత ఇచ్చారు అని. ముఖ్యంగా జగన్ పాత్రధారి జీవాకు ఈసినిమాలో నటించినందుకు దాదాపు 8 వరకూ ముట్టినట్టు తెలస్తోంది. అంతే కాదు రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన మమ్ముట్టికి 4 కోట్ల వరకూ ఇచ్చారట. ఈసినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే.. దాదాపు 25 కోట్లు రెమ్యూనరేషన్లకే పెట్టినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసినిమా ను ఎక్కువ శాతం.. కడప, పులివెందులలో షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది.
* ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా టీడీపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అనుకుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుకు సై అన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే 2014 ఎన్నికల నాటి సీన్ రిపీట్ అవుతుందని ఆయా పార్టీల అభిమానులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి, నగరి ఎమ్మెల్యే స్పందించారు. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ 2014 ఫలితాలు మళ్లీ రిపీట్ కానే కావని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు అని వివరించారు. అప్పుడు రాష్ట్ర విభజన జరగడంతో పాలనలో అనుభవం ఉన్న నాయకుడు అని చంద్రబాబును ప్రజలు గెలిపించారని అన్నారు. నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ చరష్మా కూడా చంద్రబాబుకు కలిసి వచ్చిందని పేర్కొన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. అందుకే చంద్రబాబు ఎన్ని పార్టీలను కలుపుకున్నా ఫలితం ఉండదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీకి బలం లేదని గుర్తు చేశారు. ఈ సమయంలో చంద్రబాబుతో కలిస్తే బీజేపీకే మైనస్ అని అభిప్రాయపడ్డారు. దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబు అని విమర్శించారు. ఏపీలో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీకి జరిగే నష్టమేమవీ లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌ను మంచి చేసే నాయకుడిగా నమ్ముతున్నారని తెలిపారు.
* భాజపాకు మాజీ మంత్రి బాబూమోహన్ (Babu Mohan) రాజీనామా చేశారు. గతకొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన.. తాజాగా గుడ్‌బై చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు.
* వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ భాజపా విజయం సాధిస్తుందని.. మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని హోదాలో మోదీ నగరానికి వచ్చి.. అత్యాధునిక సదుపాయాలతో సిద్ధమవుతోన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కచ్చితంగా అమలు చేస్తారని చెప్పారు.
* అయోధ్య బాల రాముని దర్శనం కోసం భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన ‘ఆస్థా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు.. గుంటూరు నుంచి బుధవారం బయలుదేరింది. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలులో 1345 మంది ప్రయాణిస్తున్నారు. రైల్వే శాఖ గుంటూరు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు నడపడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భారాస అంతర్గతంగా భాజపాతో ఒప్పందం పెట్టుకుందని పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఆరోపించారు. ఆ పొత్తు సహించలేకే భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విషయంలో ఏ పార్టీతో యుద్ధం చేశామో.. అదే పార్టీతో భారాస పొత్తు పెట్టుకోవడం బాధ కలిగించిందన్నారు.
* ఎన్నికలకు ఒకరోజు ముందు దాయాది దేశం పాకిస్థాన్(Pakistan) జంట పేలుళ్లతో దద్దరిల్లింది. బలూచిస్థాన్‌లో బుధవారం జరిగిన ఈ ఘటనల్లో 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఎన్నికల్లో పోటీపడుతోన్న అభ్యర్థుల కార్యాలయాల వద్ద ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
* పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. వంటగ్యాస్ మొదలు, బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో వంటింటి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ముఖ్యంగా శాకాహార భోజనం ఖర్చు మరింత పెరిగింది. అదే సమయంలో మాంసాహారం ఖర్చు తగ్గినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
* ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో (IND vs ENG) ఒక క్యాచ్, ఒక రనౌట్ టీమ్‌ఇండియాను విజయం వైపు నడిపించాయి. కేవలం 0.45 సెకన్లలోనే దూసుకొచ్చిన బంతిని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఒడిసిపట్టాడు. అది ఓలీ పోప్ వికెట్. తొలి టెస్టులో భారత్ ఓటమికి కారణమైన 196 పరుగుల ఇన్నింగ్స్‌ను ఆడిన బ్యాటర్. ఇక రెండోది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* విజయవాడ ఆటోనగర్ సమస్యలతో సతమతమవుతోంది. నెలల తరబడి పేరుకుపోయిన చెత్త, మురుగు నిల్వలతో ఆటోనగర్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వహణను అధికారులు గాలికొదిలేయటంతో కాలుష్యకాసారంగా మారింది. దీంతో రోడ్డుపై మురుగు నిల్వలు, చెత్త పేరుకుపోయినా పట్టించుకునే నాథుడే లేరని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* భారత్‌లో 2025 కల్లా 20 లక్షల మందికి కృత్రిమ మేధ (AI)లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈవో, ఛైర్మన్ సత్య నాదెళ్ల (Satya Nadella) తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ముంబయికి చేరుకున్న ఆయన.. ఏఐ కోసం డేటాసెట్స్ రూపొందించే సంస్థ సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏఐ విషయంలో భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
* మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించే సదుపాయాన్ని దేవాదాయ శాఖ కల్పించింది. మీ సేవ, పోస్టాఫీసు, టీయాప్ ఫోలియో ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. భక్తులు వారి బరువు ప్రకారం కిలోకు రూ.60 చొప్పున చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణ సేవను బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలను బుధవారం మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. తపాలా శాఖ ద్వారా మేడారం ప్రసాదం సైతం పొందే అవకాశం కల్పిస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
* ఏపీలో ఎన్నాళ్ల నుంచో నిరుద్యోగులు వేచి చూస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification 2024) విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో ఎస్జీటీ పోస్టులు 2,280 ఉండగా.. స్కూల్ అసిస్టెంట్ 2,299; టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 ఉద్యోగాలు చొప్పున భర్తీ చేయనున్నారు. AP DSC 2024 పరీక్షతో పాటు AP TET 2024 పరీక్షకూ నోటిఫికేషన్ విడుదల చేశారు. టెట్‌కు ఫిబ్రవరి 8 నుంచి, డీఎస్సీకి ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z