Sports

డోపింగ్ ఆరోపణలు. భారత అథ్లెట్‌పై ఎనిమిదేళ్ల నిషేధం.

డోపింగ్ ఆరోపణలు. భారత అథ్లెట్‌పై ఎనిమిదేళ్ల నిషేధం.

భారత అథ్లెట్‌ నిర్మల షెరాన్‌పై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ క్రమశిక్షణ ప్యానల్‌ ఎనిమిదేళ్ల నిషేధాన్ని విధించింది. గతేడాది నిర్వహించిన పరీక్షలో ఆమె నిషేధిత ఉత్ప్రేరకం వాడిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2017 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో నిర్మల 400 మీటర్ల పరుగులో పసిడి గెలిచింది. 2018లో డోపీగా తేలడంతో.. ఆమె ఆ పతకం కోల్పోవాల్సి వచ్చింది. నాలుగేళ్ల నిషేధాన్ని అనుభవించిన షెరాన్‌.. గతేడాది జూన్‌లో అంతరాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌తో పునరాగమనం చేసింది. రెండోసారి ఆమె డోపీగా తేలడంతో ఎనిమిదేళ్ల నిషేధం పడింది. 2023 ఫెడరేషన్‌ కప్‌లో పసిడి గెలిచిన కిర్‌పాల్‌ సింగ్‌ (డిస్కస్‌త్రో), కాంస్యం సాధించిన కరణ్‌వీర్‌ సింగ్‌ (షాట్‌పుట్‌)లతో పాటు మరో 20 మందిపై నాడా క్రమశిక్షణ సంఘం నిషేధం విధించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z