కర్నాటకలో విశ్వాస పరీక్షపై చర్చ కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 20 మంది సభకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ఓటింగ్‌లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి. మ్యాజిక్ ఫిగర్ ఎంత అనేది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ సభలో గొడవ జరిగితే చర్చ అర్థాంతరంగా వాయిదా పడే అవకాశాలూ ఉన్నాయి.విశ్వాస పరీక్షపై కర్నాటక అసెంబ్లీలో చర్చ హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. గురువారం సభకు మొత్తం 205 మంది సభ్యులు హాజరయ్యారు. వీరిలో కాంగ్రెస్‌కి చెందిన వారు 66 మంది ఉన్నారు. జేడీఎస్ నుంచి 34 మంది ఉన్నారు. బీజేపీ సభ్యులు 105 మంది కూడా విశ్వాస పరీక్షపై చర్చలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన 15 మంది ఇవాళ్టి ఓటింగ్‌కి దూరంగానే ఉంటున్నారు. వీరిలో 12 మంది కాంగ్రెస్ వాళ్లు కాగా, ముగ్గురు జేడీఎస్‌కు ఎమ్మెల్యేలున్నారు. అలాగే.. BSP ఎమ్మెల్యే మహేష్ కూడా ఓటింగ్‌లో పాల్గొనడం లేదు. కేజేపీ ఎమ్మెల్యేతోపాటు స్వతంత్ర అభ్యర్థి సైతం ఓటింగ్‌కి దూరంగా ఉంటున్నారు. ఇక.. అధికారపార్టీకి చెందిన నాగేంద్ర, స్రమాంక్ పాటిల్ అనారోగ్య కారణాలతో సభకు రాలేదు. ఈ లెక్కన చూస్తే.. మొత్తం ఇవాళ్టి సభకు 20 మంది గైర్హాజరు అయినట్టు లెక్క. ఆంగ్లోఇండియన్‌తో కలిపి 225 మంది ఉండాల్సిన సభలో 20 మంది గైర్హాజరుతో నంబర్ 205కి తగ్గింది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 103 దగ్గరే అగుతుంది. స్పీకర్ లేకుండా కాంగ్రెస్, జేడీఎస్ బలం ప్రస్తుతం 99గా ఉంది. బీజేపీ సభ్యుల బలం 105 ఉంది. మరి సభలో అనూహ్యమైన పరిణామాలు జరిగి లెక్కలు మారి కుమారస్వామి సర్కార్ గట్టెక్కుతుందా.. లేక కూలిపోతుందా అన్నది సాయంత్రం తేలిపోనుంది. ఒకవేళ ఇరుపక్షాలకు సమాన ఓట్లొస్తే అప్పుడు మాత్రమే స్పీకర్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెర
Related tags :