NRI-NRT

దోహాలో సూపర్ డ్యాన్సర్ సీజన్-2 పోటీలు

దోహాలో సూపర్ డ్యాన్సర్ సీజన్-2 పోటీలు

దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్, ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియోస్‌తో కలిసి సూపర్ డ్యాన్సర్ సీసన్ 2ను ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా నృత్యకారులు సోలో మరియు గ్రూప్ డ్యాన్స్ విభాగాల్లో ప్రతిష్టాత్మక టైటిల్ కోసం పోటీపడ్డారు. దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ ప్రెసిడెంట్ మరియు CRIC QATAR ఛైర్మన్ సయ్యద్ రఫీ నాయకత్వంలో, ఈ కార్యక్రమం విభిన్న నృత్య రూపాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్లాసికల్ నుండి పాశ్చాత్య వరకు, సినిమాటిక్ నుండి జానపద నృత్యాలు వరకు అనేక పోటీలు నిర్వహించారు.

ఈ డాన్స్ కంపిటేషన్ ఫైనల్లో 72 మంది తలపడ్డారు. జిష్ణు సత్యన్ సి, సీమా రజిత్, భావనా ​​షాగర్ నాయక్, కళామండలం కృష్ణప్రియ రాజేష్, గినేష్ అకా హంగ్రీ వోల్ఫ్, మామని నాగస్వామి మరియు మనోజ్ కుమార్ భోలన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అవంతిక రాజేష్ నాలుగు డాన్స్ ఫార్మ్స్ లో తన ప్రదర్శనలతో సోలో టైటిల్ ను కైవసం చేసుకుంది. గ్రూప్స్ పోటీలలో నృత్యోదయ టీం గ్రూప్ టైల్ విజేతగా సత్తా చాటింది.

ఈ సంద‌ర్భంగా సీఐఏ ప్రెసిడెంట్ జైప్ర‌కాష్ సింగ్, మాజీ ఐసీసీ అడ్వైజ‌రీ కౌన్సిల్ చైర్మ‌న్ కేఎస్ ప్రసాద్, టీకేఎస్ ప్రెసిడెంట్ హరీష్ రెడ్డి, ఏకేవీ ప్రెసిడెంట్ వెంకప్ప భాగవతుల, ఏకేవీ జనరల్ సెక్రటరీ విక్రమ్ సుఖవాసి, దోహా మెడిటేషన్ సెంటర్, ప్రెసిడెంట్ చూడామణి తదితరులు హాజరయ్యారు. M పాల్ రికార్డ్స్‌కు చెందిన మొహిందర్ జలంధరి, ఛానల్ 5కి చెందిన నూర్ అఫ్షాన్, దోహా మ్యూజిక్ లవర్స్‌కు చెందిన జవీద్ బజ్వా, మ్యాజికల్ థ్రెడ్ నుండి జ్యోతి & సంగీత, ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియోస్ నుండి రవి, రేడియో మిర్చి బిజినెస్ డైరెక్టర్ అరుణ్ లక్ష్మణన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హెరెల్, మొహిందర్ జలంధరి మరియు ఆఫ్రిన్ ఖాన్ కంపేరింగ్ చేశారు.


👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z