ఇప్పుడు మనం చూస్తున్న త్రివిక్రమ్.. త్రివిక్రమ్ కాదు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు, రాసిన కథలు, చెప్పిన డైలాగులు. నిజం చెప్పాలంటే.. ఒక డైరెక్టర్ కు అభిమానులు ఉండడం అనేది ఆయన నుంచే మొదలయ్యింది. సినిమాలో ఆయన చెప్పే జీవిత సత్యాలు.. స్టేజిమీద ఆయన ఇచ్చే స్పీచ్ లు.. ఎంతోమంది కుర్రకారును ఇన్స్పైర్ చేశాయి అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆ శీను కనిపించడం లేదు. ఆయన కథల్లో జీవం లేదని చెప్పుకొస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆయన సినిమా వస్తుందా.. ? అని ఎదురుచూసే ఫ్యాన్స్ ఇప్పుడు ఎలాంటి కథలు రాస్తున్నాడో అని భయపడుతున్నారు.
“నువ్వే నువ్వే” సినిమాలో తరుణ్, సునీల్, ఎమ్మెస్ నారాయణ కామెడీ ట్రాక్ ను ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇక ఆ సీన్ ను త్రివిక్రమ్, వారికి వివరిస్తున్న సమయంలో తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో చూసిన అభిమానులు.. అప్పుడున్న త్రివిక్రంను గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడున్న రచయిత వేరు.. ఆయన స్థానం వేరు.. స్థాయి వేరు అని చెప్పుకొస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z