NRI-NRT

లండన్-బెహ్రెయిన్‌లలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

లండన్-బెహ్రెయిన్‌లలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన కేక్ కట్ చేశారు. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కేసీఆర్‌ వెంట ఎలా ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉంటామని అశోక్ గౌడ్ తెలిపారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్‌ఎస్‌ ప్రజల పక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిక్కా చంద్రశేఖర్, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, హరి గౌడ్ నవాబుపేట్, సత్యమూర్తి చిలుముల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, మల్లా రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, రమేష్ ఎసెంపెల్లి, రవి రేతినేని, పృథ్వీ రావుల, జస్వంత్, శుష్మున రెడ్డి, క్రాంతి, పావ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 70 వ జన్మదిన వేడుకలు బహ్రెయిన్ లోని అండాలస్ గార్డెన్ లో ఎన్నారై బీఆర్ఎస్‌ సభ్యులంతా కేక్ కట్ చేసి వేడుక జరిపారు. బహ్రెయిన్ శివాలయంలో పూజలు చేశారు. ఎన్నారై బీఆర్ఎస్‌ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, చెన్నమనేని రాజేందర్, ఉత్కం కిరణ్ గౌడ్, చిలుకూరి రాజలింగం, మరుపాక దేవయ్య, మారంపల్లి తరుణ్, తిప్పారవేణి శ్రీనివాస్, పల్లపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z