Editorials

పాముకాటుకు బెంగుళూరు శాస్త్రవేత్తల విరుగుడు

పాముకాటుకు బెంగుళూరు శాస్త్రవేత్తల విరుగుడు

పాము కాటుకు విరుగుడు కనిపెట్టడంలో బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐ.ఐ.ఎస్‌.సి) శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. అమెరికాకు చెందిన స్కిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విష పదార్థాలను నిర్వీర్యం చేయగల మానవ యాంటీబాడీని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు. హెచ్‌ఐవి, కొవిడ్‌-19 వైరస్‌లను ఎదుర్కొనే యాంటీబాడీల అధ్యయనం ఈ పరిశోధనకు ప్రాతిపదికగా నిలిచింది. తమ సింథటిక్‌ యాంటీబాడీ త్రాచుపాము, నాగుపాము (కింగ్‌ కోబ్రా), కట్లపాము, బ్లాక్‌మాంబా వంటి పాముల విషాన్ని ఎదుర్కోగలదని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం గుర్రాలు, కంచర గాడిదలకు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందులు తయారుచేస్తున్నారు. ఈ పద్ధతి ఆ జంతువులకు హానికరంగా పరిణమిస్తోంది. తాజా పరిశోధన వల్ల ప్రయోగశాలలోనే సింథటిక్‌ యాంటీబాడీలను తయారుచేయడం వీలవుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z