Business

PayTM ఖాతాల బదిలీలపై RBI పరిశీలన

PayTM ఖాతాల బదిలీలపై RBI పరిశీలన

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌) సేవలను ఉపయోగించుకుంటున్న కస్టమర్లు, వాలెట్‌ హోల్డర్లు, వర్తకుల ప్రయోజనార్ధం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) శుక్రవారం అదనపు చర్యలు చేపట్టింది. ‘ః పేటీఎం’ యూపీఐ హ్యాండిల్‌ను ఉపయోగిస్తున్న పీపీబీఎల్‌ కస్టమర్లను ఇతర బ్యాంకులకు బదిలీ చేసే అవకాశాలను పరిశీలించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)ను ఆర్‌బీఐ కోరింది. వీరిని ఒకే బ్యాంక్‌కు కాకుండా 4-5 బ్యాంకులకు బదిలీ చేయాలని సూచించింది. ఈ ఏడాది మార్చి 15 నుంచి పీపీబీఎల్‌ ఖాతాదారులు, వాలెట్‌ హోల్డర్లు, మర్చంట్‌ కస్టమర్ల ఖాతాల్లో డిపాజిట్లు, క్రెడిట్‌పై నిషేధం అమలులోకి రానున్న విషయం తెలిసిందే. పీపీబీఎల్‌ వెబ్‌సైట్‌ డేటా ప్రకారం.. బ్యాంక్‌ నిర్వహణలో 30 కోట్ల వాలెట్లు, 3 కోట్ల బ్యాంక్‌ ఖాతాలున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z