Movies

“భక్తకన్నప్ప”లో బాలకృష్ణ?

“భక్తకన్నప్ప”లో బాలకృష్ణ?

మోహన్‌బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’లో బాలయ్య కూడా భాగం కానున్నారట. ఇందులో ఇప్పటికే మోహన్‌లాల్‌, ప్రభాస్‌, శివరాజ్‌కుమార్‌ నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు వీరితోపాటు బాలయ్య కూడా నటించనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కథ రీత్యా ఇందులో శివుడు మారువేషంలో వచ్చి కన్నప్పని పరీక్షిస్తాడని సమాచారం. ఆ మారువేషంలో వచ్చే శివుడిగా బాలయ్య కనిపించనున్నారని తెలుస్తున్నది. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సివుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z