NRI-NRT

Flash…అట్లాంటిక్ సిటీలో తానా తదుపరి మహాసభలు?

2021 TANA 23rd Convention Venue Begins Today

2021లో నిర్వహించబోయే తానా 23వ ద్వైవార్షిక మహాసభల నిర్వహణా వేదిక పరిశీలన కార్యక్రమాన్ని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. దీనిలో భాగంగా గురువారం నాడు అట్లాంటిక్ సిటీలోని కన్వెన్షన్ సెంటరును జయశేఖర్‌తో పాటు తానా కార్యదర్శి పొట్లూరి రవి, దేవినేని లక్ష్మీ, నాయునిపాటి విశ్వనాథ్, తూనుగుంట్ల శిరీష, కసుకుర్తి రాజా, బ్రహ్మాజీ వలివేటి, సుమంత్ రామిశెట్టి, పాతూరి నాగభూషణం తదితరులతో కూడిన బృందం పరిశీలించింది. ఇక్కడి హోటళ్లు, వసతి ఏర్పాట్లను ఈ బృందం పరిశీలించారు. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది.