WorldWonders

కోడికూర గురించి కొడుకుని చితకబాదిన తండ్రి-CrimeNews-March022024

కోడికూర గురించి కొడుకుని చితకబాదిన తండ్రి-CrimeNews-March022024

* వృద్ధురాలిని మంచానికి కట్టేసి ..దుండగులు 30 తులాల బంగారం చోరీకి తెగబడ్డారు. శ్రీకాకుళం నగరంలోని సరంగడాల వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదాంబ (75) ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. విషయం తెలుసుకున్న దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెను మంచానికి తాళ్లతో కట్టేశారు. నోట్లో గుడ్డలు కుక్కి మెడలోని బంగారు గొలుసులు, చేతి గాజులను ఎత్తుకెళ్లారు. దాదాపు గంటన్నర తర్వాత బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* పిల్ల‌లు త‌మ‌కు న‌చ్చిన ఆహారాన్ని తినేందుకు మాత్ర‌మే ఇష్ట‌ప‌డుతుంటారు. న‌చ్చ‌ని కూర వండితే ఆ రోజు అన్న‌మే తిన‌రు. ఉప‌వాస‌మైనా ఉంటారు.. కానీ ఆ వంట వాస‌న కూడా చూడ‌రు. అయితే ఓ పిల్లాడు కూడా కోడి మాంసానికి దూరంగా ఉన్నాడు. కోడి కూర ఎందుకు తిన‌డం లేద‌ని ఆ పిల్లాడిని తండ్రి చిత‌క‌బాదాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఖ‌మ్మం జిల్లా నేల‌కొండ‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలో శ్రీనివాస్ అనే వ్య‌క్తి నిన్న చికెన్ తీసుకొచ్చాడు. ఇక వంట చేసిన త‌ర్వాత శ్రీనివాస్ కుమారుడు ముర‌ళి(9) మాత్రం ఆ చికెన్ తిన‌లేదు. దీంతో తండ్రి తీవ్ర ఆగ్ర‌హానికి గురై కుమారుడిని విచ‌క్ష‌ణార‌హితంగా చిత‌క‌బాదాడు. శ‌రీర‌మంతా వాపు వ‌చ్చింది. నిన్న సాయంత్రం విష‌యం తెలుసుకున్న త‌ల్లి మ‌హేశ్వ‌రి కుమారుడిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఆ త‌ర్వాత భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

* నాగ‌ర్‌క‌ర్నూల్ మండలంలోని గుడిపల్లి గ్రామంలో ఇంటర్ విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన చిట్యాల రాజేష్(22) అనే యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంట్లో చదువుకుంటున్న విద్యార్థినిపై యువకుడు అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించగా, విద్యార్థిని అరుస్తూ బయటకు వచ్చింది. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు. గత గురువారం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇదిలా ఉండగా తల్లిదండ్రులు శనివారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

* హరియాణా(Haryana)లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. పొద్దున్నే అజ్రోందా గ్రామస్థులు ఓ దృశ్యాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. పుట్టి కొన్నిరోజులు కూడా కానీ పసికందు(Newborn).. శనివారం ఇనుపచువ్వలకు చిక్కుకొని, శవమై వేలాడుతూ కనిపించింది. అది చూసిన వారి హృదయం ద్రవించిపోయింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అజ్రోందా గ్రామంలో ఒక ఇంటిముందున్న చువ్వలకు చిక్కుకున్న శిశువు మృతదేహం గురించి ఈరోజు ఉదయం పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న అధికారులు ఆ బాబును బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే దగ్గర్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆ బిడ్డను విసిరేశారా..? లేక ఇంకేమైనా జరిగి ఉంటుందా అన్న దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శవపరీక్ష ద్వారా చిన్నారి మృతికి గల కారణాలు తెలుస్తాయని వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z