సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వెల్లడించారు. ఏప్రిల్ 30 వరకు డిస్కౌంట్ అమల్లో ఉంటుందని తెలిపారు. లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తుండగా.. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌కు, గోదావరిఖని – బెంగళూరు, కరీంనగర్ – బెంగళూరు, నిజామాబాద్ – తిరుపతి, నిజామాబాద్ – బెంగళూరు, వరంగల్ – బెంగళూరు రూట్లలో అందుబాటులో ఉన్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z