అంతర్జాతీయ మహిళల దినోత్సవం (మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం (మార్చి 2) లేడీస్ నైట్ నిర్వహించారు. భారతీయ సంతతికి చెందిన జిల్లా న్యాయమూర్తి జస్టిస్ షాలినా కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగాలని సూచించారు. ఆచార్య పద్మజ నందిగామ మాట్లాడుతూ.. మహిళలు కుటుంబం కోసం రోజూ నిర్వహించే సేవలు వెల కట్టలేనివని అన్నారు. సుష్మ పదుకొనే, సుమ కల్వల మాట్లాడుతూ, స్వప్న చింతపల్లి, దీప్తి వెనుకదాసుల, దీప్తి లచ్చిరెడ్డిగారి, హర్షిణి బీరపు, అర్పిత భూమిరెడ్డి, కల్యాణి ఆత్మకూరు, శిరీషారెడ్డి, డాక్టర్ అమిత కాకులవరం తదితరులను జీటీఎ డెట్రాయిట్ కార్యవర్గం అభినందించింది. డెట్రాయిట్లో వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించిన జీటీఏ ఛైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కలువల, అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి, జీటీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు పలువురు ధన్యవాదాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z