* ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ (భిత్చొఇన్) విలువ తొలిసారి 71,000 డాలర్ల మార్క్‌ను దాటింది. కాయిన్‌డెస్క్ వివరాల ప్రకారం సోమవారం ఓ దశలో 71,263.78 డాలర్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది. గత 24 గంటల్లో దాదాపు 2.5 శాతానికి పైగా లాభపడింది. దీంతో బిట్‌కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.40 లక్షల కోట్ల డాలర్లు దాటింది. 2024లో ఇప్పటి వరకు ఈ క్రిప్టో విలువ 67 శాతం మేర లాభపడడం విశేషం.
* స్విట్జర్లాండ్ వాచీలు, కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల వంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం రానుంది. భారత్-ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదరడం ఇందుకు నేపథ్యం. దీంతోపాటు రాబోయే 15 ఏళ్లలో మన దేశంలోకి రూ.8.3 లక్షల కోట్ల కచ్చిత పెట్టుబడులకూ హామీ లభించింది. ఇందువల్ల 10 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, లిక్టన్‌స్టైన్, నార్వే సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్‌టీఏ ఇప్పటివరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఎఫ్‌టీఏలో పెట్టుబడుల హామీకీ చట్టబద్దత లభించడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి ఏడాది సమయం పట్టే వీలుంది.
* రోజురోజుకీ సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దానికనుగుణంగా కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. అయితే, మితిమీరిన సాంకేతిక వినియోగంతో అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత తరంలో చాలామంది తమ రోజువారీ పనుల కోసం ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడుతుండటమే ఇందుకు కారణమంటున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (ఆనంద్ ంఅహింద్ర) కూడా దీనిపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు ఉదాహరణగా ఆయన ఒక వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. షాపింగ్‌మాల్‌లో ఓ యువకుడు ఒక చేతిలో పాప్‌కార్న్, మరో చేతిలో కూల్‌డ్రింక్ పట్టుకుని సింగిల్ వీల్ ఏఐ స్కూటర్‌పై వెళుతుంటాడు. కళ్లకు విజన్ ప్రో అద్దాలు, స్కూటర్ హ్యాండిల్‌కు రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. ఈ వీడియోను ఉద్దేశిస్తూ.. ‘‘టెక్నాలజీతో పూర్తిగా కనెక్టయి.. వాస్తవ ప్రపంచంతో డిస్‌కనెక్ట్ అయ్యాడు. ఇదే భవిష్యత్తు అయితే.. అది పీడకలే అవుతుంది’’ అని ట్వీట్ చేశారు. సాంకేతికతపై మహీంద్రా ఆందోళన వ్యక్తంచేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నట్లు ఏఐతో సృష్టించిన ఫొటోను షేర్ చేస్తూ.. భవిష్యత్తు భయానకంగా ఉండబోతోందని అభిప్రాయపడ్డారు.
* అనేక దేశాలు భారత్‌తో రూపాయల్లో వాణిజ్యం చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బంగ్లాదేశ్, శ్రీలంక సహా గల్ఫ్ ప్రాంతంలోని దేశాలు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు. తద్వారా లావాదేవీల ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. భారత అంతర్జాతీయ వాణిజ్యంలో ఇదొక మైలురాయిగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రూపాయల్లో వాణిజ్యం విషయమై భారత్‌తో ఇప్పటికే బంగ్లాదేశ్, శ్రీలంక చర్చలు జరుపుతున్నాయని గోయల్ వెల్లడించారు. కొన్ని గల్ఫ్ దేశాలు సైతం ఆ దిశగా ఆసక్తి వ్యక్తం చేశాయన్నారు. సింగపూర్ ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించిందని చెప్పారు. దీని ప్రయోజనాలు తెలియడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత అభివృద్ధి చెందిన దేశాలూ ముందుకువస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. దేశీయ కరెన్సీల్లో వ్యాపారం వల్ల ఉన్న ప్రయోజనాలు ఇతర దేశాలకు క్రమంగా తెలిసొస్తోందన్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ (శ్తొచ్క్ ంఅర్కెత్) సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు, దేశీయంగా కీలక రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ (శెన్సెక్ష్) 600 పాయింట్లకు పైగా దిగజారగా.. నిఫ్టీ (ణిఫ్త్య్) 22,350 మార్క్ దిగువకు పడిపోయింది. ఈ ఉదయం 74,175.93 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్ (భ్శే) రోజంతా నష్టాల్లోనే సాగింది. ఒక దశలో 73,433 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 616.75 పాయింట్లు కోల్పోయి 73,502.64 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (ణ్శే) కూడా 160.90 పాయింట్ల తగ్గి 22,332.65 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు క్షీణించి 82.75 వద్ద ముగిసింది.
* ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి అదనపు సమయం ఇచ్చేది లేదని భారతీయ స్టేట్ బ్యాంకుకు సుప్రీం కోర్టు (శుప్రెమె ఛౌర్త్) స్పష్టం చేయడం సదరు బ్యాంకు షేర్ల విక్రయాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి ఎస్‌బీఐ షేర్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో షేర్ ధర మధ్యాహ్నం ఒంటిగంట వరకు 2శాతం క్షీణించింది. సోమవారం ఉదయం రూ.788.5 ధరతో ప్రారంభమైన షేర్.. మధ్యాహ్నానికి రూ.16 కోల్పోయింది. ప్రస్తుతం రూ. 772 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఒకేరోజు ఈస్థాయిలో పడిపోవడం ఫిబ్రవరి 12 తర్వాత ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z