DailyDose

అనంతలో ప్రొఫెసర్ హత్య-CrimeNews-Mar 11 2024

అనంతలో ప్రొఫెసర్ హత్య-CrimeNews-Mar 11 2024

* యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ అయిన వ్యక్తి తన కుమార్తె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (హర్యన ఫ్రొఫెస్సొర్) యూనివర్సిటీలోని ఆ ప్రొఫెసర్‌ ఆఫీస్‌లో ఇద్దరి మృతదేహాలను భార్య గుర్తించింది. హర్యానాలోని హిసార్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల సందీప్ గోయల్ 2016 నుంచి హిసార్‌లోని లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 8 ఏళ్ల కుమార్తెతో కలిసి స్కూటర్‌పై రైడ్‌కు వెళ్తున్నట్లు భార్యకు చెప్పాడు. అయితే యూనివర్సిటీలోని తన కార్యాలయానికి కూతుర్ని తీసుకెళ్లాడు. అక్కడ సర్జికల్‌ బ్లేడ్‌తో ఆమె గొంతు కోసి చంపాడు. అనంతరం అదే బ్లేడ్‌తో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

* ఉత్తరప్రదేశ్‌ ( ఊత్తర్ ఫ్రదెష్)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హై టెన్షన్‌ విద్యుత్‌ వైర్లను తాకడంతో ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘాజీపూర్‌ (ఘజిపుర్) జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు సుమారు 30 మంది ప్రయాణికులతో మహాహర్ పట్టణానికి వెళ్తోంది. మార్దా పట్టణ సమీపంలోకి రాగానే బస్సు హై టెన్షన్‌ విద్యుత్‌ వైర్లను తాకింది. దీంతో బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అవి కొద్దిసేపటికే బస్సుమొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

* టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో డీప్‌ఫేక్ (డీప్ఫకె) మహమ్మారిలా వ్యాపిస్తోంది. చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే ఈ డీప్‌ఫేక్ బారిన పడ్డారు. డీప్‌ఫేక్ బారినపడ్డ ప్రముఖుల జాబితాలోకి తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ‘యోగి ఆదిత్యనాథ్’ కూడా చేరారు. డయాబెటిస్ మెడిసిన్‌ను ‘ఆదిత్యనాథ్’ ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. వీడియో వైరల్ అయిన తర్వాత, ఈ వీడియోకు కారణమైన ఫేస్‌బుక్ ఖాతాపై ఐపీసీ 419, 420, 511 సెక్షన్స్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రముఖులకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ యాక్టర్స్ రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్, అలియా భట్‌లకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

* క‌ళ్ల ముందే భ‌ర్త హ‌త్యకు గుర‌య్యాడు. త‌ట్టుకోలేక భార్య గుండెపోటుతో చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో చోటు చేసుకుంది. వ‌న్‌టౌన్ సీఐ రెడ్డ‌ప్ప తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. న‌గ‌రంలోని జేఎన్టీయూ స‌మీపంలో మూర్తి రావు గోఖ‌లే(59), ఆయ‌న భార్య శోభ‌(56) నివ‌సిస్తున్నారు. మూర్తి రావు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని గ‌తంలో మేన‌ల్లుడు ఆదిత్య ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకున్నారు. ఈ విష‌యంలో ఆదివారం రాత్రి ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెర‌గ‌డంతో క‌త్తితో ఆదిత్య‌, మూర్తి రావు గొంతు కోసి హ‌త‌మార్చాడు. క‌ళ్ల ముందే భ‌ర్త‌ను హ‌త్య చేయ‌డంతో.. భార్య త‌ట్టుకోలేక అదే రోజు అర్ధ‌రాత్రి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. దంప‌తుల మృతితో బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z