Sports

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా-NewsRoundup-Mar 28 2024

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా-NewsRoundup-Mar 28 2024

* భాజపా అభ్యర్థుల ప్రకటనతో తెలుగుదేశం (TDP) పార్టీ జాబితాపై స్పష్టత వచ్చింది. పొత్తుల్లో భాగంగా జనసేన, భాజపా అభ్యర్థులను దాదాపు ప్రకటించడంతో ఇక తెదేపా ఎక్కడెక్కడ పోటీ చేసేది తేలిపోయింది. తొలి జాబితాలో ప్రకటించిన మూడు స్థానాలను మిత్రపక్షాలకు సర్దుబాటు చేయడంతో పెండింగ్‌లో ఉన్న 5 స్థానాలు కలిపి మొత్తం 8 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

* హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. నిందితులు.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్‌ శంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరి గురువారం కోర్టుకు హాజరయ్యారు.

* వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. ‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. 90 శాతం హమీలు నెరవేర్చానని చెబుతున్న జగన్‌.. తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు.

* తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొడంగల్‌లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు.

* మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా ఆళ్లగడ్డలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆళ్లగడ్డలో రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అన్నదాతల సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందించేందుకు భూమా అఖిలప్రియ అక్కడికి బయల్దేరారు.

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. అచ్చెన్నపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

* రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, గట్టు మల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు. గట్టు మల్లు గతంలో ఎస్‌ఐబీలో సీఐగా పని చేశారు. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది.

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (Toyota Kirloskar Motor) కార్ల ధరలను పెంచనుంది. ఎంపిక చేసిన మోడళ్లపై 1 శాతం వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరకుల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

* మద్యం విధానం కేసు(Excise policy case)లో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఈడీ కస్టడీని దిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్‌ 1వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం వెల్లడించింది.

* సొంత పార్టీపైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన భాజపా (BJP) ఎంపీ వరుణ్‌ గాంధీ (Varun Gandhi)కి తాజా ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పీలీభీత్‌ స్థానంలో ఈసారి రాష్ట్ర మంత్రి జితిన్‌ ప్రసాదను నిలబెట్టింది కాషాయ పార్టీ. దీంతో వరుణ్‌గాంధీ భవిష్యత్తు కార్యాచరణపై ఆసక్తి రేగింది.

* దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) వెల్లడించారు. సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌ ఏర్పాటుచేసిన సదస్సులో పాల్గొన్న ఆయన.. అగ్నివీర్‌ (Agniveer) పథకంపై వస్తోన్న విమర్శలతో పాటు పలు అంశాలపై మాట్లాడారు. ఈసందర్భంగా తన 50 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో పలు విశేషాలను పంచుకున్నారు. భారత్‌-చైనా సరిహద్దు అంశంలో విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ.. తాను ఎన్నడూ ఇబ్బందికరంగా భావించలేదన్నారు.

* కాంగ్రెస్‌కు (Congress) పెట్టని కోట అది. మిన్ను విరిగి మీదపడుతున్నా.. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ఆశలు చూపినా అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థే విజేత. 2019 ఎన్నికల్లో మినహా 1952 నుంచి ఇక్కడ కాంగ్రెస్‌కు ఎదురు లేదు. కానీ, తాజా ఎన్నికల్లో ఆ స్థానం అంతర్గత పోరుకు వేదికైంది. అక్కడి అభ్యర్థిని ఎంపిక చేయడం పార్టీ హైకమాండ్‌కు కత్తిమీద సాములా తయారైంది. అదే.. కర్ణాటకలోని కోలార్‌ (Kolar Lok Sabha Constituency) లోక్‌సభ నియోజకవర్గం. అసమ్మతి నేతల ధిక్కార స్వరంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. హైమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

* అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన ‘పుష్ప’ రికార్డులను సృష్టించింది. ఈ చిత్రానికి గాను హీరో, సంగీత దర్శకుడు నేషనల్‌ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ కథ మూడో పార్ట్‌కు (Pushpa 3) సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి ‘పుష్ప: ది రోర్‌’ అనే టైటిల్‌ పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం బన్నీ, సుకుమార్‌లు మూడో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌పై చర్చలు కూడా జరిపారట. మొదటి భాగాన్ని ‘పుష్ప: ది రైజ్‌’తో ప్రారంభించిన చిత్రబృందం దానికి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ను రూపొందిస్తున్నారు. దాని తర్వాత ‘పుష్ప: ది రోర్‌’ పేరుతో పార్ట్‌3 తెరకెక్కించి కథను ముగించనున్నారట.

* తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొడంగల్‌లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు. ‘‘ఎన్నికలు వస్తే సెలవులొస్తాయి.. తీర్థయాత్రలకు వెళ్దామని కొందరు అనుకుంటారు. ఓటు చాలా విలువైనది. ఎన్ని కార్యక్రమాలున్నా.. ఓటు వేసేందుకు కొడంగల్‌ వచ్చాను. కార్యకర్తలను కలవాలని వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు నా వెంట ఉన్నారు. ప్రచారానికి రాకున్నా గెలిపించారు. ఇక్కడికి సిమెంట్‌ పరిశ్రమ రాబోతోంది. పరిశ్రమలు వస్తే భూముల ధరలు పెరుగుతాయి. ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది. ఏప్రిల్‌ 6న జరిగే తుక్కుగూడ కాంగ్రెస్‌ బహిరంగ సభకు.. కొడంగల్‌ నుంచి 25 వేల మంది తరలిరావాలి. ఈ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారు. 5 గ్యారంటీలు ప్రకటిస్తారు’’ అని చెప్పారు.

* జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసుకుంది. గత నెలలో ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ.. తాజాగా ఈ పరీక్షలను ఏప్రిల్‌ 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల విడుదల సందర్భంగా గురువారం ఇచ్చిన ప్రకటనలో ఈ తేదీలను పొందుపరిచింది. అంతకుముందు షెడ్యూల్‌ విడుదల సమయంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య JEE Main session 2 పరీక్షలు జరుగుతాయని పేర్కొన్న NTA.. ఆ తర్వాత ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ షెడ్యూల్‌లోనూ మార్పులు చేయడం గమనార్హం.

* మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 100 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఏఆర్వో ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా అందులో 644 మంది పురుషులు, 795 మంది మహిళ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఓటు వేశారు. ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్‌ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, భారాస నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా సహా దాదాపు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. పొలిటికల్‌ అజెండాతో కొన్ని ‘ప్రత్యేక బృందాలు’ తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయస్థానాల పరువు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

* హైదరాబాద్‌ లోక్‌సభ ఎంపీగా సానియా పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆమెను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌లో.. బీజేపీ మాధవీ లతను పోటీకి దింపింది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఎంఐఎంకు పట్టున్న హైదరాబాద్‌ నియోజకవర్గంలో సానియా మీర్జాను పోటీకి నిలపడం ద్వారా ఒవైసీకి చెక్‌ పెట్టవచ్చనే యోచనలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన సానియా మీర్జా.. గతంలో తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌గా ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z