కాచిన నూనెలతో మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్‌తోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశమున్నదని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన ఏఎస్ఎఫ్బీఏఎంబీ (అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ) వార్షిక సమావేశంలో ఈ అధ్యయానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు. ఈ పరిశోధనల్లో నూనెకు, మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి వెల్లడైంది. ఎలుకలపై పరిశోధనలు నిర్వహించినట్టు వారు తమ నివేదికలో వెల్లడించారు. కొన్ని ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా, మరికొన్నింటికి కాచిన నూనెతో చేసిన ఆహారం ఇచ్చారు. ఈ రెండింటినీ పోల్చి చూస్తే.. కాచిన నూనెతో చేసిన ఆహారం తిన్న ఎలుకల్లో మెదడు అనారోగ్య ముప్పును ఎదురొన్నాయని పరిశోధకులు తెలిపారు. కాచిన నూనెతో చేసిన వంటల వినియోగంతో శారీరక సమతుల్యత దెబ్బ తింటుందని గుర్తించారు. కీలకమైన జీర్ణ వ్యవస్థ, కాలేయాన్ని దెబ్బతీస్తుందని తేలింది. ఈ నూనె కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పలువురు ఆరోగ్య నిపుణులూ హెచ్చరిస్తున్నాన్నారు. ఇది ఫ్రీ రాడికల్స్ ముప్పు పెంచుతుందని, దీనివల్ల దేహంలో వాపు ఏర్పడి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు. ఇప్పుడు తాజా పరిశోధన కూడా వాటిని నిరూపిస్తున్నదని పరిశోధకులు వెల్లడించారు. పదే పదే వేడిచేసిన నూనెలతో చేసిన వంటలతో మనిషి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలూ పెరగుతాయని, దీర్ఘకాలిక రోగాలు వేధిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ప్రమాదాలను తగ్గించుకోవడానికి.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వారు పేర్కొంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z