* సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు చేసింది. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వీరిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. ఐఏఎస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా అధికారి గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషా ఉన్నారు.
* కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (Gautam Adani).. నిత్యం వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు. ప్రత్యర్థులకు దీటుగా దూసుకెళ్లేందుకు సరికొత్త వ్యూహాలు రచించడంలో తలమునకలై ఉంటారు. అలాంటి వ్యక్తి తాజాగా ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్టు ఆకట్టుకుంటోంది. తన చిట్టి మనవరాలితో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈసందర్భంగా ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తంచేశారు. ‘‘నీ చూపుల్లోని వెలుగు ముందు ప్రపంచంలోని సంపద అంతా వెలవెలబోయే’’ అని రాసుకొచ్చారు. ఆ పాప పేరు కావేరీ. గౌతమ్ అదానీ-ప్రీతి దంపతులకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు కరణ్, జీత్. ఆ పాప కరణ్-పరిధి కుమార్తె.
* లోక్‌సభ ఎన్నిలకు తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణకు ఇవ్వనున్న ప్రత్యేక నిధులు, అనుమతులను అందులో పొందుపరుస్తామని చెప్పారు. ఏప్రిల్ 6న నిర్వహించనున్న ‘జనజాతర’ సభ ఏర్పాట్లను మంత్రులు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
* దిల్లీ మద్యం పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ వ్యవహారంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు వరుసగా అరెస్టవుతున్న తరుణంలో.. ఆ పార్టీకి కాస్త ఊరట కలిగింది. ఈ వ్యవహారంలో ఆరు నెలల క్రితం అరెస్టయిన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌కు (Sanjay Singh) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు విధించిన షరతులకు లోబడి నడుచుకోవాలని ఆయన్ని ఆదేశించింది.
* ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్నాలజీ పరంగా వస్తున్న అత్యాధునిక మార్పులతో పాటు ఆర్థిక అనిశ్చితులే దీనికి కారణం. వడ్డీరేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు కంపెనీల కార్యకలాపాలను దెబ్బతీశాయి. దీంతో ఖర్చుల నియంత్రణలో భాగంగా సిబ్బంది సంఖ్యలో కోత పెడుతున్నాయి. తాజాగా ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ ‘మెకిన్సీ అండ్ కంపెనీ’ (McKinsey & Company) సైతం బ్రిటన్‌లోని తమ కంపెనీ ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది.
* సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పులివెందుల మేజిస్ట్రేట్ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు రామ్‌సింగ్, సునీత, రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో వీరు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి చర్యలు చేపట్టకుండా నాలుగు వారాలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల లాభాల జోరుకు బ్రేక్ పడింది. మూడు రోజుల పాటు వరుసగా లాభపడిన సూచీలు.. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో నష్టాలు చవిచూశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం వంటివి ఇందుక్కారణం. అమెరికాలో తాజాగా వెలువడిన గణాంకాలు వడ్డీ రేట్ల కోత ఆలస్యం కావొచ్చన్న ఆందోళనలు పెంచాయి.
* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ప్రధాని నరేంద్రమోదీ (Modi) ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశం అట్టుడుకుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రధాని ఖండించారు. అసలు అదేం భాష అని విమర్శించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపుర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
* ప్రముఖ పుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు (Zomato).. ఆదాయపు పన్ను శాఖ నుంచి ట్యాక్స్ డిమాండ్ నోటీసు అందింది. సర్వీస్ ట్యాక్స్, పెనాల్టీ కలిపి రూ.184 కోట్లు చెల్లించాలని ఆ శాఖ ఆదేశించింది. దీనిపై అప్పీల్‌కు వెళతామని జొమాటో పేర్కొంది. సోమవారం అర్ధరాత్రి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
లోక్‌సభ అభ్యర్థులు వీరే..
కడప- వైఎస్ షర్మిల
కాకినాడ – పల్లం రాజు
బాపట్ల – జేడీ శీలం
రాజమహేంద్రవరం – గిడుగు రుద్రరాజు
కర్నూలు – రామ్ పుల్లయ్య యాదవ్
అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే..!
ఇచ్ఛాపురం- ఎం.చక్రవర్తిరెడ్డి
పలాస- మజ్జి త్రినాథ్‌బాబు
పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
శ్రీకాకుళం- పైడి నాగభూషణ్‌రావు
ఆమదాలవలస – సన్నపాల అన్నాజీరావు
ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వరరావు
నరసన్నపేట – మంత్రి నరసింహమూర్తి
రాజాం (ఎస్సీ) – కంబాల రాజవర్ధన్
పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు
పార్వతీపురం (ఎస్సీ)- బత్తిన మోహనరావు
సాలూరు (ఎస్టీ)- మువ్వల పుష్పారావు
చీపురుపల్లి – తుమ్మగంటి సూరినాయుడు
గజపతినగరం – గడపు కూర్మినాయుడు
విజయనగరం – సుంకరి సతీశ్ కుమార్
విశాఖ తూర్పు – గుత్తుల శ్రీనివాసరావు
మాడుగుల – బీబీఎస్ శ్రీనివాసరావు
పాడేరు (ఎస్టీ) – శటక బుల్లిబాబు
అనకాపల్లి – ఇల్లా రామ గంగాధరరావు
పెందుర్తి – పిరిడి భగత్
పాయకరావుపేట(ఎస్సీ)- బోని తాతారావు
తుని- జి.శ్రీనివాసరావు
ప్రత్తిపాడు- ఎన్‌వీవీ సత్యనారాయణ
పిఠాపురం- ఎం. సత్యానందరావు
కాకినాడ రూరల్- పిల్లి సత్యలక్ష్మి
పెద్దాపురం – తుమ్మల దొరబాబు
అనపర్తి- డా. యెల్ల శ్రీనివాసరావు
కాకినాడ సిటీ – చెక్క నూకరాజు
రామచంద్రాపురం – కోట శ్రీనివాసరావు
ముమ్ముడివరం- పాలెపు ధర్మారావు
అమలాపురం (ఎస్సీ) – ఐతాబత్తుల సుభాషిణి
రాజోలు (ఎస్సీ) – ఎస్.ప్రసన్నకుమార్
కొత్తపేట – రౌతు ఈశ్వరరావు
మండపేట – కామన ప్రభాకరరావు
రాజానగరం – ముండ్రు వెంకట శ్రీనివాస్
రాజమండ్రి సిటీ – బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
రాజమండ్రి రూరల్ – బాలేపల్లి మురళీధర్.
జగ్గంపేట – మారోతి వీవీ గణేశ్వరరావు
కొవ్వూరు (ఎస్సీ) – అరిగెల అరుణ కుమారి
నిడదవోలు – పెద్దిరెడ్డి సుబ్బారావు
పాలకొల్లు – కొలకలూరి అర్జునరావు
నరసాపురం – కానూరి ఉదయ భాస్కర కృష్ణప్రసాద్
భీమవరం – అంకెం సీతారాము
ఉండి – వేగేశ వెంకట గోపాలకృష్ణమ్
తణకు – కడలి రామారావు
తాడేపల్లిగూడెం – మర్నీది శేఖర్
ఉంగుటూరు – పాతపాటి హరి కుమారరాజు
దెందులూరు – ఆలపాటి నర్సింహమూర్తి
పోలవరం (ఎస్టీ) – సృజన దువ్వెల
చింతలపూడి (ఎస్సీ) – వున్నమట్ల ఎలీజ
తిరువూరు (ఎస్సీ) – లాం తాంతియా కుమారి
నూజివీడు- మరీదు కృష్ణ
గుడివాడ – వడ్డాది గోవిందరావు
కైకలూరు- బొడ్డు నోబెల్
పెడన – శొంటి నాగరాజు
మచిలీపట్నం – అబ్దుల్ మతీన్
అవనిగడ్డ – అందే శ్రీరామమూర్తి
పామర్రు (ఎస్సీ) – డీవై దాస్
పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం
మైలవరం – బొర్రా కిరణ్
నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య
పెదకూరపాడు – పమిడి నాగేశ్వరరావు
తాడికొండ (ఎస్సీ) – చిలకా విజయ్‌కుమార్
పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్
వేమూరు (ఎస్సీ)- బూర్గా సుబ్బారావు
ప్రత్తిపాడు (ఎస్సీ)- కె.వినయ్ కుమార్
గుంటూరు తూర్పు – షేక్ మస్తాన్ వలీ
చిలకలూరిపేట – మద్దుల రాధాకృష్ణ
నరసరావుపేట -షేక్ మహబూబ్ బాషా
వినుకొండ – చెన్నా శ్రీనివాసరావు
గురజాల – టి.యలమందరెడ్డి
మాచర్ల – వై. రామచంద్రారెడ్డి
దర్శి – పొట్లూరి కొండారెడ్డి
అద్దంకి – అడుసుమిల్లి కిశోర్‌బాబు
ఒంగోలు – బి. రమేశ్ బాబు అలియాస్ బీఆర్ గౌస్
కందుకూరు – సయీద్ గౌస్ మొహిద్దీన్
కొండపి (ఎస్సీ) – శ్రీపతి సతీష్
మార్కాపురం – షేక్ సైదా
గిద్దలూరు – పగడాల పెద్ద రంగస్వామి
కనిగిరి – కదిరి భవాని
ఆత్మకూరు – చెవూరు శ్రీధరరెడ్డి
కొవ్వూరు -ఎన్.మోహన్
నెల్లూరు రూరల్ – షేక్ ఫయాజ్
సర్వేపల్లి – పూల చంద్రశేఖర్
గూడూరు (ఎస్సీ) – వేమయ్య చిల్లకూరి
సూళ్లూరుపేట (ఎస్సీ) – గాది తిలక్‌బాబు
ఉదయగిరి – సోము అనిల్ కుమార్‌రెడ్డి
బద్వేల్ (ఎస్సీ) – నీరుగట్టు దొర విజయజ్యోతి
కోడూరు (ఎస్సీ) – గోసాల దేవి
రాయచోటి – షేక్ అల్లాబక్ష్
నందికొట్కూరు (ఎస్సీ)- తొగురు ఆర్థర్
నంద్యాల – గోకుల కృష్ణారెడ్డి
కోడుమూరు (ఎస్సీ) – పరిగెళ్ల మురళీకృష్ణ
రాయదుర్గ్ – ఎంబీ చిన్న అప్పయ్య
ఉరవకొండ – వై.మధుసూదన్ రెడ్డి
గుంతకల్ – కావలి ప్రభాకర్
తాడిపత్రి – గుజ్జల నాగిరెడ్డి
శింగనమల (ఎస్సీ) – సాకె శైలజానాథ్
రాప్తాడు – ఆది ఆంధ్రా శంకరయ్య
మడకశిర (ఎస్సీ) – కరికెర సుధాకర్
హిందూపూరం – వి.నాగరాజు
పెనుకొండ – నరసింహప్ప
పుట్టపర్తి – మధుసూదన్ రెడ్డి
కదిరి – కేఎస్ షానవాజ్
తంబళ్లపల్లి – ఎం.ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి
పీలేరు – బి. సోమశేఖర్ రెడ్డి
మదనపల్లి – పవన్ కుమార్ రెడ్డి
పుంగనూరు -డా.జి.మురళీ మోహన్ యాదవ్
చంద్రగిరి – కనుపర్తి శ్రీనివాసులు
శ్రీకాళహస్తి – డా. రాజేశ్‌నాయుడు పోతుగుంట
సత్యవేడు (ఎస్సీ) – బాలగురువం బాబు
నగరి – పోచారెడ్డి రాకేశ్ రెడ్డి
చిత్తూరు – జి.తికారామ్
పలమనేరు – బి. శివశంకర్
కుప్పం – ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపి)
* వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్ .. కడప ఎంపీ టికెట్ ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన అనంతరం ఇడుపులపాయలో ఆమె మీడియాతో మాట్లాడారు.
* లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మరోసారి భీకర ఎన్‌కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. బీజాపుర్ (Bijapur) జిల్లాలోని దండకారణ్యంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి.
* మాజీ మంత్రి హరీశ్‌రావు నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని భాజపా నేత రఘునందన్‌రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా భారాస అధినేత కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, వెంకట్రామిరెడ్డి పేర్లనూ చేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై 2014 నుంచే విచారణ చేపట్టాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రూ.మూడున్నర కోట్లు పట్టుకున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎందుకు పిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడికి పోయాయని రఘునందన్ నిలదీశారు. ఈ విషయంలో తాను చేసిన ఫిర్యాదుపై పోలీసులు, ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు.
* ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతోన్న అభ్యర్థులకు అలర్ట్.. రైల్వే మంత్రిత్వశాఖలో 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ముగియనుంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 11.59గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 21 ఆర్‌ఆర్‌బీల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే. పోస్టుల వివరాలు: మొత్తం 9,144 ఉద్యోగాలు ఉండగా.. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ 1092 పోస్టులు కాగా.. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు 8,052. వయో పరిమితి: జులై 1,2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు. గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్/దివ్యాంగులు.. ఆయా కేటగిరీల వారికి వయో సడలింపు కల్పించారు. దరఖాస్తు రుసుం రూ.500. కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసిన తర్వాత రూ.400 రిఫండ్ చేస్తారు. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్/మహిళలు/థర్డ్‌జెండర్/మైనార్టీలు/ఈబీసీలు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష తర్వాత ఈ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. వేతనం: టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ పోస్టులకు ఏడో సీపీసీలో లెవెల్-5 కింద ప్రారంభ వేతనంగా రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్ -3 పోస్టులకు లెవెల్ -2 కింద ₹19,990 చొప్పున చెల్లిస్తారు. టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, వయో పరిమితి, జోన్‌ల వారీగా పోస్టుల సంఖ్య, పరీక్ష ప్యాట్రన్, సిలబస్ తదితర పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
* మా నాన్న ఎన్నో నోములు నోచితే.. నేను పుట్టాను అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత అభిమానం, ఆదరణ లభించిందంటే.. ఇది నా అదృష్టం అని మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు.
* జై శ్రీరాం నినాదం కడుపు నింపదు.. ఆ నినాదం నీకు ఉద్యోగం ఇవ్వదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి అని కేటీఆర్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మాత్రమే. మనిషిని మనిషిగా చూసే పార్టీ.. మతం కోణంలో చూడని పార్టీ కూడా బీఆర్ఎస్సే. యువత ఎవరైనా జై శ్రీరాం అంటే సముదాయించాలి. జై శ్రీరాం అనే నినాదాం కడుపు నింపదు.. నీకు ఉద్యోగం ఇవ్వదు.. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి.. కొట్టాడేటోళ్లు కావాలి.. మీ కోసం పార్లమెంట్‌లో కొట్లాడేవాళ్లు కావాలని యువతకు విడమరిచి చెప్పాలని కేటీఆర్ సూచించారు.
* కేసీఆర్ పొలంబాట పట్టిన తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నిన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేశారని, కేసీఆర్ వెళ్లడంతో సాగర్ ఎడమ కాలువకు నీళ్లు వదిలారని చెప్పారు. ఇప్పుడు కరీంనగర్ వస్తున్నారని ఎస్సారెస్పీ కాలువకు నీళ్లిచ్చారని తెలిపారు. రైతులను ఆదుకోవాలని, ధాన్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీలు అమలు చేయాలని కోరుతూ సిద్దిపేట కలెక్టర్‌కు హరీశ్ రావు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నీరు, విద్యుత్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. సర్కార్ అలసత్వం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్లున్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని చెప్పారు.
* పతంజలి ఉత్పత్తుల గురించి తప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev) ఇవాళ సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పారు. ఆ కేసులో ప్రత్యక్షంగా ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు. రాందేవ్, బాలకృష్ణలు వ్యక్తిగతం హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని, ఆ ఆదేశాల ప్రకారం ఆ ఇద్దరూ కోర్టుకు వచ్చినట్లు వాళ్ల తరపు న్యాయవాది వెల్లడించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో రాందేవ్ బాబా క్షమాపణలు తెలిపారు. పతంజలి సంస్థ ఉత్పత్తులకు గురించి మెడికల్ యాడ్స్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో గతంలో పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రత్యక్షంగా కోర్టుకు క్షమాపణలు చెప్పారు. జస్టిస్ హిమా కోహ్లీ, అషానుద్దిన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వారం రోజుల్లోగా మెడికల్ యాడ్స్ కేసులో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని బాబా రాందేవ్, బాలకృష్ణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z