నేరం చేసిన చోట తమ వేలిముద్రలు పడకుండా, ఇతరత్రా ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడే జాదూగాళ్లను కూడా పక్కాగా కనిపెట్టేందుకు ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సరికొత్త విధానాన్ని గుర్తించారు. ఇందులో నేర ప్రదేశంలో గాలిలో నుంచి మానవ డీఎన్ఏను సేకరించి విశ్లేషిస్తారు. మనుషులు మాట్లాడినప్పుడు, శ్వాసించినప్పుడు కూడా వారి డీఎన్ఏ ఆనవాళ్లు వాతావరణంలోకి విడుదలవుతుంటాయని పరిశోధకులు తెలిపారు. వాటిని అక్కడి వాతావరణం నుంచి సేకరించొచ్చని పేర్కొన్నారు. ఏదైనా గదిలో ఎయిర్ కండిషనింగ్ యూనిట్ల ద్వారా వాయు ప్రసరణ జరుగుతున్నప్పుడు.. డీఎన్యే ఆనవాళ్లు అక్కడి ఘన, ద్రవ ఉపరితలాలపై స్థిరపడుతుంటాయని, గాలిలోనూ తిరుగుతుంటాయని వివరించారు. ఈ తరహా పర్యావరణ డీఎన్ఏ (ఈడీఎన్ఏ)ను సేకరించి విశ్లేషిస్తే నేరగాళ్లను గుర్తించడం సులువవుతుందని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z