ప్రముఖ దివంగత నటి శ్రీదేవి బయోపిక్ గురించి బాలీవుడ్లో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కాగా శ్రీదేవి బయోపిక్ గురించి ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు. ‘‘శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె జీవితం కూడా ప్రైవేట్‌గానే ఉండాలి. అందుకే నేను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు అనుమతి ఇవ్వను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాతో బోనీ కపూర్ మాట్లాడినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z