హ్యాండ్ శానిటైజర్ (Hand Sanitiser).. దీని గురించి తెలియని వారు ఉండరు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు అంతా దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా చేతులకు శానిటైజర్ రాసుకోవడం మాత్రం రోజూ కార్యకలాపాల్లో భాగంగా మారిపోయింది. దేన్ని పట్టుకున్నా వెంటనే జేబు లేదా పర్స్‌లో నుంచి శానిటైజర్ బాటిల్‌ను తీసుకుని వెంటనే చేతులపై రాసేసుకుంటున్నారు. అయితే, అనవసరంగా, అతిగా శానిటైజర్ వాడటంవల్ల చాలా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. హ్యాండ్ శానిటైజర్ అతిగా వాడటం వల్ల మన బ్రెయిన్ దెబ్బతింటుందని (brain problems) తాజా అధ్యయనంలో తేలింది. ఒహియో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలోని మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్మెంట్ చేసిన సర్వేలే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హ్యాండ్ శానిటైజర్ వల్ల మెదడులోని కణాలు దెబ్బతింటాయని ఈ అధ్యయనంలో తేలింది. మనుషుల మెదడులో ఒలిగోడెండ్రోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉంటాయి. మెదడు వేగంగా, చురుగ్గా పనిచేసేందుకు ఈ కణాలు సహాయపడతాయి. ముఖ్యంగా మన బుర్రకు వేగంగా సంకేతాలు పంపించడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే, ప్రస్తుతం మనం వాడే శానిటైజర్లలో ఉన్న కొన్ని రసాయనాల కారణంగా ఈ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z