NRI-NRT

టెక్సాస్‌లో తెలంగాణ యువకుడు మృతి

టెక్సాస్‌లో తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం రాత్రి (భారతీయ కాలమాన ప్రకారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు(విలేజి)కు చెందిన బండి రోహిత్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బండి అనిల్‌రెడ్డి, అనితారెడ్డి దంపతులు సుమారు 20 సంవత్సరాల నుంచి హనుమకొండలోని సహకారనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రోహిత్‌రెడ్డి టెక్సాస్‌లో అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు రోహన్‌రెడ్డి కూడా అక్కడే ఎంఎస్‌ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలైన రోహిత్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై తల్లిదండ్రులకు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి టెక్సాస్‌కు ప్రయాణమయ్యారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z