తానా న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో అమెరికాకు ఉన్నత విద్య కోసం వస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్” పేరిట అవగాహన తరగతులను ఏర్పాటు చేసినట్లు ప్రాంతీయ ప్రతినిధి సోంపల్లి కృష్ణప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల ఓరియంటేషన్ ఆవశ్యకత, పెప్పర్ స్ప్రే వినియోగం, సామాజిక బాధ్యత, స్థానిక చట్టాలు, స్వీయ భద్రత వంటి పలు అంశాలపై ఈ తరగతుల్లో అవగాహన కల్పిస్తారు. “తానా రిఫ్రెష్ ప్రోగ్రామ్” అంతర్జాతీయ విద్యార్థుల మైండ్ సెట్‌ను రిఫ్రెష్ చేస్తుందని, తద్వారా ప్రమాదాలను, దుర్ఘటనలను కొంతమేర తగ్గించవచ్చని సోంపల్లి పేర్కొన్నారు. 724-726-1166 నెంబరులో సంప్రదించవచ్చు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z