అతి త్వరలో మీ మొబైల్స్, కార్లలోని సిస్టమ్స్ ను రీబూట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి. అతి తర్వలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(జీపీఎస్)కు బదులు నేవిగేషన్ విత్ ఇండియన్ కన్ స్టెల్లేషన్(నావిక్) మనకు దారి చూపబోతోంది. ఈ మేరకు సిస్టమ్స్ ను సాఫ్ట్ వేర్ తో అప్ గ్రేడ్ చేయడానికి క్వాల్ కామ్ తదితర మాన్యుఫాక్చరింగ్ కంపెనీలతో ఇస్రో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇవి పూర్తయితే ఇండియన్స్ వాడుతున్న మొబైల్స్, కార్లకు అప్ గ్రేడ్స్ వెళ్తాయి. రీబూట్ తర్వాత జీపీఎస్ సిస్టం మన మొబైల్స్ నుంచి కనుమరుగై, నావిక్ కనిపిస్తుంది.
*2017లోనే నావిక్ వచ్చింది
ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం(ఐఆర్ఎన్ఎస్ఎస్)–1జీ శాటిలైట్ ను ఇస్రో 2017 నవంబర్ లో సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. ఆ వెంటనే నావిక్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. కానీ నేటి వరకూ ఇండియా దాన్ని మిలటరీ అవసరాలకు మాత్రమే వాడుతోంది. ఈ వ్యవస్థ కోసం ఇస్రో మొత్తం ఏడు ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్ ను పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ రాకెట్లతో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఇందుకోసం దాదాపు 1,420 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఏడు శాటిలైట్స్ లో మూడింటిని జియో స్టేషనరీ ఆర్బిట్స్ లోనూ, నాలుగింటిని జియో సింక్రనస్ ఆర్బిట్స్ లోనూ ప్రవేశపెట్టారు.
*రెండు రకాల సర్వీసులు
నావిక్ ఇండియాతో పాటు మన సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ ఏరియాలో నేల, నింగి, నీళ్లపై నావిగేషన్కు సాయపడుతుంది. విపత్తు నిర్వహణ, వెహికల్ ట్రాకింగ్, ఫ్లీట్ మేనేజ్ మెంట్, ఇంటిగ్రేషన్ విత్ మొబైల్ ఫోన్స్, మ్యాపింగ్, జియోడెటిక్ డేటా కాప్చర్, హైకర్స్, ట్రావెలర్స్ నావిగేషన్, డ్రైవర్లకు విజువల్ అండ్ వాయిస్ నావిగేషన్ కు ఉపయోగపడుతుంది. నావిక్ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసు(ఎస్పీఎస్)ను యూజర్లు అందరికీ అందిస్తుంది. ఇందులోని మరో ఫీచర్ ఎన్ క్రిప్టెడ్ రెస్ట్రిక్టెడ్ సర్వీసు(ఆర్ఎస్). ఇది కేవలం పర్మిషన్ ఉన్న యూజర్లకు మాత్రమే కనిపిస్తుంది.
స్వదేశీ సాంకేతికతతో వస్తున్న “నావిక్”
Related tags :