Business

తగ్గిన బంగారం ధర

తగ్గిన బంగారం ధర

బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. ఇన్నాళ్లూ భారీగా పెరిగిన బంగారం ధరకు (Gold price) కాస్త బ్రేక్‌ పడింది. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో పసిడి ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర క్షీణించడంతో దేశీయంగా వెయ్యి రూపాయలకు పైనే తగ్గింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్లు) ధర రూ.74,300గా (పన్నులు కలుపుకొని) ఉంది. వెండి కిలో ధర సైతం రూ.2 వేల వరకు తగ్గింది. 83,300 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సు 2322 డాలర్లుగా ఉంది. ఒక్కరోజులోనే దాదాపు 50 డాలర్లకు పైగా తగ్గింది. పశ్చిమాసియాలో ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణలు ఇటీవల పసిడి ధరలకు రెక్కలు రావడానికి కారణమయ్యాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారంవైపు మదుపరులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఘర్షణలు తగ్గుముఖం పట్టడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరికొంత కాలం పాటు అధిక వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశాలు కనిపిస్తుండడంతో పసిడికి గిరాకీ తగ్గింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z