ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. పంపు కోసం సమీపంలోని గ్రామ సచివాలయం వద్ద వాలీబాల్ ఆడుకుంటున్న యువకుల వద్దకెళ్లారు. వారిలో ఒకడైన తొలికొండ రాజా.. బాలుడిని పట్టుకున్నాడు. అతని ప్రవర్తన చూసి మిగతా పిల్లలు అక్కడి నుంచి పరుగుతీశారు. తన చేతికి చిక్కిన బాలుడి మలద్వారంలో పంపు పెట్టిన రాజా.. బలవంతంగా గాలి కొట్టాడు. బాలుడి కడుపు ఉబ్బడంతో పాటు మర్మాంగాలు వాచాయి. తొలుత ఇంట్లో చెప్పకుండా బాలుడు మిన్నకుండిపోయాడు. రాత్రివేళ నొప్పి తీవ్రమై విలవిల్లాడటంతో తల్లిదండ్రులు గమనించి నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గురువారం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. బాధితుడి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z