త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు, తన వ్యక్తిగత జీవితం గురించి అమెరికా (USA) అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) పలు విషయాలను పంచుకున్నారు. అలాగే ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆ పరిస్థితికి గల కారణాన్ని వెల్లడించారు. 1972లో జరిగిన కారు ప్రమాదంలో జో బైడెన్ మొదటి భార్య, కుమార్తె మరణించారు. ఆ ఘటన తర్వాత ఆయన మానసికంగా కుంగిపోయారట. ‘‘ఆ సమయంలో మద్యానికి అలవాటుపడ్డా. అప్పటివరకు ఆ ఆలవాటు లేదు. బ్రిడ్జి మీదకు వెళ్లి, దూకాలనే ఆలోచనలు వెంటాడేవి. కానీ అప్పుడు వెంటనే నా ఇద్దరు కుమారులు గుర్తొచ్చేవారు’’ అని వెల్లడించారు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రమాదం తర్వాత బైడెన్ ఒంటరిగా తన ఇద్దరు పిల్లల సంరక్షణ చూసుకున్నారు. కొద్దికాలానికి జిల్‌తో పరిచయం ఏర్పడింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z