* విజయవాడ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పటమట ప్రాంతంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. స్థానికంగా నివాసముంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డి.శ్రీనివాస్ (40)తో పాటు ఆయన భార్య ఉష (38) , ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్ (8), తల్లి రమణమ్మ (65) మరణించారు. మంగళవారం ఉదయం పని మనిషి ఇంటికి వెళ్లి చూడగా బాల్కనీలో శ్రీనివాస్ ఉరేసుకుని కనిపించారు. వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు ఉన్నాయని.. వాళ్ల గొంతులు కోసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ ఇటీవల ఆస్పత్రి పెట్టారు. నష్టాలు రావడంతో దాన్ని అమ్మేశారు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. దీంతో ఆయనే కుటుంబాన్ని హతమార్చి ఆపై ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
* వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ రాజప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాలాల మండలం దౌలాపూర్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాండూరు డిపోలో రాజప్ప పనిచేస్తున్నాడు. ఘటనాస్థలంలో లేఖ లభ్యమైంది. అధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి. దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు. సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్ బెయిల్ కోర్టు డిస్మిస్ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.
* రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (ఆమిత్ షహ్) చెబుతున్నట్లుగా నకిలీ వీడియోలు (Fఅకె విదెఒ) సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై గుజరాత్ (ఘుజరత్) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే అమిత్ షా నకిలీ వీడియోను షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేత అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం.. బనస్కంతాకు చెందిన సతీశ్ వన్సోలా, దాహోద్ జిల్లాకు చెందిన రాకేశ్ బరియాను మంగళవారం అరెస్టు చేసింది. వీరిలో సతీశ్.. గత ఆరేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇక, రాకేశ్ గత నాలుగేళ్లుగా ఆమ్ఆద్మీ పార్టీ దాహోద్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.
* భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భారత్కు చెందిన సాహిల్ శర్మ(24) మెహక్ (19)కు గతేడాది వివాహం జరిగింది. వివాహం అనంతరం దంపతులు లండన్లోని క్రోయిడాన్లో నివాసముంటున్నారు. ఈక్రమంలోనే సాహిల్ తన భార్యను కత్తితో దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన సాహిల్ పోలీసులకు సమాచారం అందించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మెహక్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z